Rain alert: వాతావరణశాఖ హెచ్చరిక.. మరో కొన్ని గంటలలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. కరీంనగర్, సిద్దిపేట, మెదక్,కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా వచ్చే 2-3గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు ఉరుములు,మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం గంటకు 40-50 కి.మీ, గురువారం 30-40 కి.మీ వేగంతో అక్కడక్కడ గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ఈ వాతావరణ మార్పు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏర్పడిందని,ఇది ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనంగా మారిందని తెలిపింది.