Page Loader
Narayana Murthy: పని గంటలపై మళ్లీ హాట్ టాపిక్.. వారానికి 100 గంటలు పనిచేసే వ్యక్తి మోదీ మాత్రమే: నారాయణమూర్తి 
వారానికి 100 గంటలు పనిచేసే వ్యక్తి మోదీ మాత్రమే: నారాయణమూర్తి

Narayana Murthy: పని గంటలపై మళ్లీ హాట్ టాపిక్.. వారానికి 100 గంటలు పనిచేసే వ్యక్తి మోదీ మాత్రమే: నారాయణమూర్తి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో పని గంటలపై కొంతకాలంగా భారీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారానికి 100 గంటలు పనిచేసే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అభిప్రాయపడ్డారని ఎంపీ తేజస్వీ సూర్య వెల్లడించారు. నారాయణమూర్తితో కలిసి విమాన ప్రయాణం చేసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ.. తామిద్దరం పని గంటలపై ఆసక్తికరమైన చర్చ జరిపామని ఆయన పేర్కొన్నారు. ముంబయి నుంచి బెంగళూరు తిరిగి వస్తున్న సమయంలో నారాయణమూర్తితో కలిసి ప్రయాణించానని తేజస్వీ సూర్య ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా వెల్లడించారు.

వివరాలు 

దేశాన్ని ప్రపంచ ఐటీ శక్తికేంద్రంగా నిలబెట్టిన నారాయణమూర్తి: తేజస్వీ

ఆ ప్రయాణంలో తమ మధ్య ఎంతో ప్రేరణ కలిగించే సంభాషణ జరిగిందని వివరించారు. భారత ఐటీ రంగానికి మార్గనిర్దేశకుడిగా నిలిచిన నారాయణమూర్తి.. దేశాన్ని ప్రపంచ ఐటీ శక్తికేంద్రంగా నిలబెట్టారని కొనియాడారు. ఇన్ఫోసిస్ సంస్థ లక్షలాది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక స్థిరత తీసుకువచ్చిందని గుర్తుచేశారు. ఆ సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నైతిక విలువలు (Ethics)వంటి అంశాలపై కూడా చర్చ జరిగిందని తేజస్వీ తెలిపారు. అయితే తాను నారాయణమూర్తితో మాట్లాడుతూ.. 'మీరు సూచించినట్లుగా వారానికి 70 గంటలు పని చేయడానికి ప్రయత్నిస్తున్నాను' అంటూ సరదాగా చెప్పానని గుర్తుచేశారు. అందుకు ప్రతిగా నారాయణమూర్తి.. 'నాకు తెలిసి వారానికి 100 గంటలు పనిచేసే వ్యక్తి ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే' అని స్పందించారని తేజస్వీ వివరించారు.

వివరాలు 

వారానికి కనీసం 70 గంటల పని చేయాలి 

భారత యువత ప్రత్యర్థి దేశాలతో పోటీపడాలంటే వారానికి కనీసం 70 గంటల పని చేయాలని నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారని గుర్తుచేసుకోవాలి. ఇదే తరహాలో వారానికి 90 గంటలు పని చేయాలని ఎల్‌ అండ్‌ టి సంస్థ చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తేజస్వీ సూర్య చేసిన ట్వీట్