
Ratan Tata: ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానాన్ని నడిపిన రతన్ టాటా.. జెట్ విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు లైసెన్స్
ఈ వార్తాకథనం ఏంటి
రతన్ టాటా (Ratan Tata)కు స్పీడ్ కార్లంటే చాలా ఇష్టం. అదే సమయంలో, ఆయన ఒక మంచి పైలట్ కూడా.
ఆయన పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. 69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్‌ను నడిపి సంచలనం సృష్టించారు.
అమెరికా ఆయుధ తయారీ సంస్థ ఆయన్ను స్వయంగా ఎఫ్-16 నడపడానికి ఆహ్వానించింది. ఆయనకు జెట్ విమానాలు, హెలికాప్టర్లు నడిపించడానికి లైసెన్స్ కూడా ఉంది.
2007లో బెంగళూరులో ఏరో ఇండియా షో జరిగింది. ఇందులో లాక్‌హీడ్ మార్టిన్ తమ ఫైటర్ జెట్లను ప్రదర్శించింది.
ఆ రోజు ఆ సంస్థ టాటాను ఆ ఫైటర్ విమానం నడిపించడానికి ఆహ్వానించింది. ఈ అవకాశాన్ని టాటా సంతోషంగా అందుకున్నారు. ఈ ప్రయాణంలో ఆయన కోపైలట్‌గా వ్యవహరించారు.
వివరాలు
ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానాన్ని నడిపిన రతన్ టాటా
దాదాపు అరగంటపాటు సాగిన ఈ అడ్వెంచర్‌లో, లాక్‌హీడ్ పైలట్ విమానాన్ని కొద్దిగా నడిపించి, కంట్రోల్ టాటాకు అప్పగించారు.
ఈ సమయంలో పైలట్ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. వాస్తవానికి ఒక సందర్భంలో, వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్ వేగంతో దూసుకుపోయింది.
ఆయనకు ఒక రెప్లికాను కూడా లాక్‌హీడ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ మర్నాడే, ఆయన బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానాన్ని నడపడం విశేషం.
వివరాలు
రతన్‌కు వైమానిక రంగంపై ఆసక్తి
దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తిరిగి రతన్ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకున్నది.
ఈ సంస్థ టాటా గ్రూప్‌కు బదిలీ అయిన తర్వాత, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా తొలిసారిగా స్పందించారు.
ఎయిరిండియా ప్రయాణికులకు సాదర స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆడియో మెసేజ్ పంపించారు. రతన్‌కు వైమానిక రంగంపై ఉన్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది.