
Narayan Singh Chaura: సుఖ్‌బీర్ బాదల్‌పై కాల్పులు జరిపిన నారాయన్ సింగ్ ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు.
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద సేవాదార్‌గా విధులు నిర్వహిస్తున్న సుఖ్‌బీర్‌పై ఇవాళ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
నారాయణ్ సింగ్ మాజీ ఖలిస్తానీ మిలిటెంట్‌గా పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన వ్యక్తి.
నారాయణ్ సింగ్ గతంలో అకాల్ ఫెడరేషన్ చీఫ్‌గా పనిచేశాడు. అతను మూడు సార్లు పాకిస్థాన్‌కు వెళ్లి సిక్కు తీవ్రవాదంపై పుస్తకాలు రాశాడు.
1995లో భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్య కేసులో నారాయణ్ సింగ్ అనుమానితుడిగా నిలిచాడు.
2004లో బురెయిల్ జైలు నుంచి పారిపోయిన ఘటనలో కూడా అతని పేరు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
వివరాలు
చౌరాపై ఉన్న కేసులు
నారాయణ్ సింగ్ చౌరాపై మొత్తం 30 కేసులు ఉన్నాయి. 2010లో అమృత్‌సర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేశారు.
యూఏపీఏ చట్టం కింద అమృత్‌సర్, తరణ్ తారన్, రోపర్ ప్రాంతాల్లో అతనిపై అనేక కేసులు నమోదు అయ్యాయి.
అరెస్టులు,పరారీలు:
2013లో తరణ్ తారన్‌లోని జలాలాబాద్ గ్రామంలో నారాయణ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, అతను ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. 1984లో చౌరా పాకిస్థాన్‌కు పారిపోయినట్టు పోలీసుల కథనం చెబుతోంది.
ఆ సమయంలో అతను పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్మగ్లింగ్ చేశాడు.
పాకిస్థాన్‌లో ఉన్నప్పుడు, గెరిల్లా యుద్ధంపై పుస్తకాలు రాయడం ద్వారా తీవ్రవాదం కోసం మద్దతు పొందినట్టు పోలీసులు పేర్కొన్నారు.
వివరాలు
చౌరా గత చరిత్రపై మళ్లీ చర్చ
ఈ ఘటన సుఖ్‌బీర్ సింగ్ భద్రతపై ఆందోళనలు కలిగిస్తుండగా, నారాయణ్ సింగ్ చౌరా గత చరిత్ర మళ్లీ చర్చనీయాంశమైంది.