Page Loader
YV Subba Reddy: ఎవరు ఏ పార్టీలో చేరినా మేమే అధికారంలోకి వస్తాం : వైవీ సుబ్బారెడ్డి
ఎవరు ఏ పార్టీలో చేరినా మేమే అధికారంలోకి వస్తాం : వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy: ఎవరు ఏ పార్టీలో చేరినా మేమే అధికారంలోకి వస్తాం : వైవీ సుబ్బారెడ్డి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2024
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) పేర్కొన్నారు. బుధవారం ప్రకాశం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలనే వైసీపీకి మరింత బలం చేకూరుతాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న పేదలందరూ మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, టికెట్ల మార్పుపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. బీసీలకు సీట్లు ఇవ్వడం వల్లే కొన్ని సీట్లను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని, ఒకరిద్దరు పార్టీ మారడం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు.

Details

సీఎం జగన్ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని యాత్రలు, డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వల్లే 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, పార్టీ అప్పగించిన బాధ్యతలను మాత్రమే తాను నిర్వర్తిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.