
Project Kusha : గగనతల రక్షణ వ్యవస్థ కోసం 'ప్రాజెక్టు కుశ'.. ఐరన్ డోమ్‌కు స్వదేశీ వెర్షన్ అవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కి కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటి స్వదేశీ రక్షణ వ్యవస్థ రాబోతోందా? వచ్చే ఏడాదిలో భారత్ ప్రాజెక్ట్ కుషా కింద తయారైన క్షిపణుల పరీక్షలు ప్రారంభించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీప్రకటించిన ప్రతిష్టాత్మక మిషన్ సుదర్శన చక్రలో భాగం. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ దీన్ని అధికారికంగా ప్రకటించారు. "2035 నాటికి దేశంలోని ఆసుపత్రులు, రైల్వేలు, ఆధ్యాత్మిక కేంద్రాలు వంటి ప్రతి ముఖ్య ప్రదేశానికి ఆధునిక సాంకేతిక రక్షణ వలయం ఏర్పడుతుంది. ప్రతి పౌరుడు భద్రంగా ఉన్న భావన కలగాలి," అని ఎర్రకోటపై నుంచి మోదీ అన్నారు.
ప్రాజెక్ట్ కుషా
ప్రాజెక్ట్ కుషా అంటే ఏమిటి?
ప్రాజెక్ట్ కుషా ఒక గోప్యమైన స్వదేశీ రక్షణ ప్రణాళిక. దీని లక్ష్యం డ్రోన్లు,యుద్ధ విమానాలు,క్షిపణులు వంటి విభిన్న గగన ముప్పులను తిప్పికొట్టగల దీర్ఘ శ్రేణి, బహుళ-స్థాయి రక్షణ వ్యవస్థ అభివృద్ధి చేయడం. దీన్ని ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (ERADS) లేదా ప్రిసిషన్-గైడెడ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ (PGLRSAM) అని కూడా పిలుస్తారు. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్,రష్యా S-400 తరహాలో ఉంటుందని చెబుతున్నారు. అమెరికా కూడా తన గోల్డెన్ డోమ్ వ్యవస్థను తయారు చేస్తోంది,దీని ఖర్చు వచ్చే 20 ఏళ్లలో కనీసం 500 బిలియన్ డాలర్లు అవుతుందని అంచనా.
ప్రాజెక్ట్ కుషా
ప్రాజెక్ట్ కుషా అంటే ఏమిటి?
ఈ ప్రాజెక్ట్‌ను DRDO (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) ముందుండి నడుపుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కూడా కీలక భాగస్వామి. BEL చైర్మన్ మనోజ్ జైన్ మాట్లాడుతూ, "మేము DRDOతో కలిసి రకరకాల రాడార్లు, నియంత్రణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తున్నాం" అని తెలిపారు. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) 2022 మేలో ఈ ప్రాజెక్ట్‌కి ₹21,700 కోట్లు ఆమోదించింది. వచ్చే ఏడాదిలో కొత్త ఇంటర్‌సెప్టర్ క్షిపణుల పరీక్షలు మొదలవుతాయి.
పని
ఇది ఎలా పనిచేస్తుంది?
ప్రాజెక్ట్ కుషాలో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి.. రాడార్ - 500 కి.మీ దూరంలో ఉన్న శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను కూడా గుర్తించగలదు. కమాండ్ & కంట్రోల్ సిస్టమ్ - మొత్తం యుద్ధ నియంత్రణ. ఇంటర్‌సెప్టర్ క్షిపణులు - ముప్పును ఎదుర్కొనే అసలు ఆయుధం. M1 మిసైల్ - 150 కి.మీ దూరంలో శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. 2026లో పరీక్షలు జరగనున్నాయి. M2 మిసైల్ - 250 కి.మీ శ్రేణి, ముఖ్యంగా యాంటీ-షిప్ క్షిపణులను అడ్డుకుంటుంది. 2027లో పరీక్షలు జరుగుతాయి. M3 మిసైల్ - 350 కి.మీ శ్రేణి, పెద్ద విమానాలు, బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకునే సామర్థ్యం. ఇది 2028లో పరీక్షించబడుతుంది.
అభిప్రాయం
నిపుణుల అభిప్రాయం
ఈ క్షిపణులు 85% సింగిల్-షాట్ కిల్ ప్రాబబిలిటీ కలిగి ఉంటాయి. రెండు క్షిపణులు సల్వో మోడ్‌లో వదిలితే విజయావకాశం 98.5% వరకు పెరుగుతుంది. వీటిలో హిట్-టు-కిల్ (HTK) టెక్నాలజీ వాడతారు, అంటే పేలుడు పదార్థం కాకుండా కైనెటిక్ ఎనర్జీతో శత్రు లక్ష్యాన్ని నాశనం చేస్తాయి. నిపుణుల ప్రకారం,ఇది భారత్ రక్షణలో ఒక పెద్ద మలుపు. ముఖ్యంగా రష్యా S-400 మీద ఆధారపడే పరిస్థితిని తగ్గిస్తుంది. ఇది మోదీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా,ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని చెబుతున్నారు.
అభిప్రాయం
నిపుణుల అభిప్రాయం
"రక్షణ నిపుణుడు రాజీవ్ నయన్ మాట్లాడుతూ.. మోదీ దేశీయ, బాహ్య భద్రతా సవాళ్లను ఒకే ఫ్రేమ్‌వర్క్‌లో కలిపారని తెలిపారు. అయితే కొందరు నిపుణులు వ్యయ భారం, అన్ని వ్యవస్థలను సమన్వయం చేయడమే పెద్ద సవాలు అని సూచిస్తున్నారు. భారత్ లాంటి పెద్ద దేశానికి ఇది ఖరీదైన ప్రాజెక్ట్ అవుతుందని చెబుతున్నారు.