Sambit Patra: "పొరపాటున నోరు జారి" పశ్చాత్తాపం కోసం "ఉపవాసం" చేపట్టిన బీజేపీ నేత
ఈ వార్తాకథనం ఏంటి
సోమవారం పూరీలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేసిన సంగతి తెలిసిందే. ఈ రోడ్‌షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఈ క్రమంలో బీజేపీ నేత సంబిత్ పాత్రా జగన్నాథుడి గురించి చేసిన వ్యాఖ్యలపై చాలా విమర్శలు వచ్చాయి.
అయితే ఇప్పుడు అయన తన ప్రకటనపై క్లారిటీ ఇచ్చాడు. తన ప్రకటనపై బీజేపీ నేత క్షమాపణలు చెప్పారు.
నోరు జారినందుకు క్షమాపణలు చెబుతున్నానని, ప్రాయశ్చిత్తం కోసం ఆయన ''ఉపవాసం'' ఉంటున్నట్లు ప్రకటించారు.
Details
సంబిత్ పాత్రా వివరణ
సోమవారం ఒడిశా పూరిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. దీని తర్వాతఅనంతరం మీడియాతో సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. పూరి పట్టణంలో కొలువదీరిన జగన్నాథుడు ప్రధాని నరేంద్రమోడీ భక్తుడని నోరు జారారు.
దీనిపై బిజూ జనతాదళ్(బీజేడీ) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అయితే, తాను జగన్నాథుడిపై ప్రధాని మోదీకి ఉన్న భక్తి గురించి తెలియజేస్తూ పొరపాటున జనన్నాథుడు మోదీ భక్తుడు పేర్కొన్నానని వివరణ ఇచ్చారు.
Details
మీడియా ఛానెల్‌లకు వివరణ ఇచ్చిన సంబిత్
టంగ్ స్లిప్ అయ్యినందుకు పశ్చాత్తాపంగా ఆయన ''ఉపవాసం'' ఉంటున్నట్లు ప్రకటించారు. ''నేను అన్న ఒక మాట వివాదాన్ని సృష్టించింది.
పూరీలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో తర్వాత, నేను చాలా మీడియా ఛానెల్‌లకు వివరణ ఇచ్చాను, ప్రధాని నరేంద్ర మోదీ మహాప్రభు జగన్నాథ భక్తుడని ప్రతిచోటా అదే మాట చెప్పాను, అయితే అనుకోకుండా నోరు జారాను.
అనుకోకుండా ఈ తప్పు చేశాను. కానీ దేవుడు అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. దీనికి పశ్చాత్తాపంగా జగన్నాథుడి కోసం ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నాను'' అని సంబిత్ పాత్ర చెప్పారు.
Details
నవీన్ పట్నాయక్ ఎదురుదాడి
సంబిత్ పాత్ర ప్రకటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎదురుదాడి చేశారు.
ఇది ఒకరకంగా దేవుడిని అవమానించడమేనన్నారు. జగన్నాథుడు విశ్వానికి ప్రభువు అని, ఆయనను మానవ భక్తుడిగా పిలవడం ఆయనను అవమానించడమేనని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది జగన్నాథ భక్తులు, ఒరియా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని సీఎం పట్నాయక్ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.