
Amethi-Rahul Gandhi: అమేథీలో రాహుల్ గాంధీ మళ్లీ స్మృతీ ఇరానీతో తలపడతారా?
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల గురించి అందరికీ తెలిసిందే.
గత ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పై పోటీ చేసిన స్మృతీ ఇరానీ బంపర్ మెజారిటీతో గెలిచి ఏకంగా కేంద్రమంత్రి పదవినే చేజిక్కించుకున్నారు.
ఈసారి మాత్రం అమేథీ నియోజకవర్గంలో బీజేపీకి గానీ,స్మృతీ ఇరానీకి గాని అంత వేవ్ లేదనే చెబుతున్నారు స్థానికులు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గం నుంచే పోటీచేస్తారా? లేదా స్మృతీ ఇరానీకి జడిసిపోయి వేరే చోటెక్కడైనా పోటీ చేస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజలందరి మదిలో తొలిచే ప్రశ్నిది.
రాహుల్ గాంధీని తనపై పోటీ చేసి ఇండియా కూటమి మద్దతు తీసుకోకుండా గెలవాలని స్మృతీ ఇరానీ సవాల్ విసురుతోంది.
Smruthi Irani
వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించిన కాంగ్రెస్
మరి ఈ సవాళ్లకు రాహుల్ గాంధీ సమాధానం చెబుతారా అంటే ప్రస్తుతం దీనిపై ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా తన పని తను చేసుకెళ్లిపోతున్నారు ఆయన.
కాంగ్రెస్ లోని పెద్దలు కూడా వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అమలు చేద్దామని, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిద్దామని రాహుల్ గాంధీకి సూచిస్తోంది.
రాజకీయ కురుక్షేత్రంలో టైమింగ్ ది చాలా కీలక పాత్ర. వాయొనాడ్లో పోలింగ్ ముగిసిన తర్వాతే అమేథీ లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం గురించి మాట్లాడదామని ఆ పార్టీ భావిస్తోంది.
ఈ వ్యూహాత్మక ఆలస్యం ఎందుకన్నది తమ చర్యల ద్వారానే తెలియపరుస్తామనేది కాంగ్రెస్ ఆలోచన. వాయోనాడ్ ను తన దృష్టి నుంచి తీసివేయాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదు.
Amethi contest
కాంగ్రెస్ కే ఎక్కువ పట్టు
వాస్తవానికి స్థానిక పోల్ మేనేజ్ మెంట్ , లోకల్ సెంటిమెంట్ అంతా చూస్తే అమేథీలోని కాంగ్రెస్ కు ఎక్కువ పట్టుంది.
2002-2003 నుంచి అక్కడ ప్రియాంక గాంధీ మైక్రో మేనేజ్మెంట్ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
అమేథీ నియోజకవర్గంలోని 876 గ్రామాల్లో ని సుమారు 8680 మంది పూర్వ ప్రముఖ్ లను కలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
క్షేత్రస్థాయిలో తమ పార్టీకి పూర్వవైభవం కలిగేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతోంది.
మరి రాహుల్ గాంధీ అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాబయటకేమీ చెప్పకుండా ప్రస్తుతానికైతే నిశ్శబ్దంగానే పని కానిచ్చేస్తున్నారు.
ఇంకోమాటలో చెప్పాలంటే చాపకింద నీరులా అన్న మాట....