Parliament Winter Session: నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు మంగళవారం వెల్లడించారు. ఈ సమావేశాల్లో భాగంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంవిధాన్ సదన్ (పార్లమెంట్ పాత భవనం) సెంట్రల్ హాల్ వేదికకానుంది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి
ప్రస్తుతం మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ తర్వాతే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో కేంద్రం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనుంది. గత సెషన్‌లోనే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది, కానీ విపక్షాల తీవ్ర నిరసన కారణంగా దానిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది.