హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఓ యువతి మృతి,మరొకరికి తీవ్రగాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీది నుంచి పడి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన స్విటి పాండే(22) ఆమె స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి JNTU నుంచి ఐకియా వైపు బైక్ పై బయల్దేరారు.
అతివేగంగా బైక్ నడుపుతున్న రాయన్ ల్యుకే హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పైనున్న గోడను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న స్విటి పాండే ఒక్కసారిగా ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలైంది.
గోడను ఢీకొన్న రాయన్ ల్యుకేకు గాయాలయ్యాయి.
గాయపడిన వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్విటీ పాండే మరణించింది.
Details
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ
తెల్లవారుజామున 4 సమయంలో JNTU నుంచి ఐకియా వైపు ఫ్లై ఓవర్ పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.