Page Loader
దిల్లీ మెట్రోలో బ్రాలెట్, మినీ స్కర్ట్‌లో మహిళ హల్‌చల్; అశ్లీల ప్రదర్శనపై చట్టం ఏం చెబుతోంది?

దిల్లీ మెట్రోలో బ్రాలెట్, మినీ స్కర్ట్‌లో మహిళ హల్‌చల్; అశ్లీల ప్రదర్శనపై చట్టం ఏం చెబుతోంది?

వ్రాసిన వారు Stalin
Apr 04, 2023
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా అశ్లీల ప్రదర్శన, డ్యాన్స్‌లు, వీడియోలు తీయడాన్ని దిల్లీ మెట్రో ఇప్పటికే నిషేధించింది. అయినా ఆ ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించడం లేదు. తాజాగా ఒక మహిళ దిల్లీలో మెట్రోలో టాప్ లెస్ బ్రాలెట్, స్కర్ట్ ధరించి అసభ్యకరంగా ప్రవర్తించింది. దిల్లీ మెట్రోలో ఆమె హల్ చల్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ అశ్లీల ప్రదర్శనను ఖండిస్తుంటే, కొందరు మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇష్టమైన వస్త్రాధారణ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తుందని చెబుతున్నారు.

మహిళల అసభ్యకర ప్రాతినిధ్యం

మహిళల అసభ్యకర ప్రదర్శనను నిరోధించే చట్టం ఏం చెబుతుంది?

ఐపీసీ సెక్షన్ 292ప్రకారం అశ్లీల వస్తువుల విక్రయం, పంపిణీ, ప్రచురణ అనేది నిషేదం. పుస్తకం, కరపత్రం, కాగితం, రాయడం, డ్రాయింగ్, పెయింటింగ్, బొమ్మ లేదా ఏదైనా ఇతర వస్తువు అశ్లీలతను ప్రేరేపిస్తే దాన్ని నిరోధించాలని చట్టం చెబుతుంది. మహిళల అసభ్యకర ప్రాతినిధ్యం (నిషేధ) 1986 చట్టంలోని ఐపీసీ సెక్షన్ 294 అనేది అశ్లీల చర్యలు, పాటలకు శిక్షను నిర్దేశిస్తుంది. ఎవరైనా, ఇతరులకు కోపం తెప్పించేలా ఏదైనా బహిరంగ ప్రదేశంలో అసభ్యకర చర్య కు పాల్పడినా, అశ్లీల పాట పాడినా, పలికినా మూడు నెలల వరకు జైలు శిక్ష/ జరిమానా విధిస్తారు. ఈ చట్టం కింద నేరం రుజవైతే గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తారు.