LOADING...
F-35 Fighter Jet: 37 రోజుల తర్వాత తిరుగుప్రయాణమైన బ్రిటిష్ ఎఫ్-35బి 
37 రోజుల తర్వాత తిరుగుప్రయాణమైన బ్రిటిష్ ఎఫ్-35బి

F-35 Fighter Jet: 37 రోజుల తర్వాత తిరుగుప్రయాణమైన బ్రిటిష్ ఎఫ్-35బి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం సాంకేతిక సమస్యల కారణంగా కేరళ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన విషయం తెలిసిందే. బ్రిటన్ నుంచి నిపుణులను పిలిపించి విమానానికి మరమ్మతులు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దాదాపు ఐదు వారాలుగా ఈ యుద్ధ విమానం తిరువనంతపురం విమానాశ్రయంలోనే నిలిచి ఉంది. అయితే తాజాగా ఈ విమానం గాల్లోకి ఎగరగలిగింది. బ్రిటన్ నుంచి వచ్చిన నిపుణులు విమానంలో ఉన్న సమస్యను గుర్తించి మరమ్మతులు చేపట్టారు. దాంతో ఐదు వారాల విరామం తర్వాత యుద్ధ విమానం గాల్లోకి ఎగిరింది.

వివరాలు 

మరమ్మతులు పూర్తి చేసిన రాయల్ నేవీ ప్రత్యేక బృందం

హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ యుద్ధ విమానాన్ని పైలట్ జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రారంభ రోజుల్లో ఈ విమానం రన్‌వే మీదే నిలిచిపోయి ఉండగా, తర్వాత విమానాశ్రయం లోపల షెడ్డుకు తరలించారు. బ్రిటన్ నుంచి వచ్చిన నిపుణులు మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు రాయల్ నేవీ ప్రత్యేక బృందం తిరువనంతపురానికి చేరుకొని మరమ్మతులు పూర్తి చేసింది. తాజాగా విజయవంతంగా గాల్లోకి ఎగరడంతో ఈ విమానాన్ని బ్రిటన్‌కు తిరిగి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

37 రోజుల తర్వాత తిరుగుప్రయాణమైన బ్రిటిష్ ఎఫ్-35బి