
Bhatti Virkamarka: యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాడిందని, వారి ఆశలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 53 వేల మందికి నియామకపత్రాలు అందించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు టీఎస్ జెన్‌కో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
మాదాపూర్ సైబర్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయా నియామకపత్రాలను భట్టి విక్రమార్క అందజేశారు.
వీర్లపాలెం (దామచర్ల మండలం) నుంచి 112 మందికి జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండర్లు, ఆఫీస్ సబార్డినేట్లుగా ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు.
Details
ఉపాధి కల్పనపై దృష్టి
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల కోసం భూములు తీసుకున్నా, భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.
చాలా మంది నిర్వాసితులు వృద్ధులయ్యారని, అయితే ఇప్పుడు వారికి తక్షణ ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారికీ ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు అందించేందుకు రూ.9 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
Details
వేల మందికి ఉపాధి
రాజీవ్ గాంధీ సూచనల మేరకు నేదురమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు.
నేడు ఐటీ రంగం వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. భవిష్యత్‌లో హైదరాబాద్‌ను మరింత విస్తరించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.