
Telangana:టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, ఎకో,టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
ముఖ్యంగా, యాదగిరిగుట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలోని తిరుమల ఆలయానికి ఉన్న టీటీడీ బోర్డు లానే, యాదాద్రి ఆలయానికి తెలంగాణలో ప్రత్యేక టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.
టూరిజం,యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు.
రాష్ట్రంలో హెల్త్ టూరిజాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని జూపార్క్‌కు ప్రత్యామ్నాయంగా మరో జూపార్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
వివరాలు
స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
సచివాలయంలో నిర్వహించిన మరో సమీక్షలో, స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రాజెక్టులు, హెల్త్, ఎకో టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిపై అధికారులతో ఆయన చర్చించారు.
ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు పంపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ సహా మంత్రులు, ప్రభుత్వం ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని, నిబంధనల ప్రకారం సమానంగా వ్యవహరిస్తున్నామని పునరుద్ఘాటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
స్పీడ్‌పై (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్
— Congress for Telangana (@Congress4TS) August 30, 2024
డెలివరీ) ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ విభాగాల… pic.twitter.com/ugm3aGbb9J