Page Loader
Weather Updates: ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

Weather Updates: ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు,పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాల్లో 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది.

వివరాలు 

తెలంగాణలో నాలుగు రోజుల వర్ష సూచన… 

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. గుజరాత్ ప్రాంతం,దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. కాగా, నిన్నటి రోజున తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి.

వివరాలు 

కర్ణాటకలో మూడోరోజూ భారీ వర్షాల బీభత్సం… 

పశ్చిమ కనుమల ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. కర్ణాటకలో వరుసగా మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో మంగళూరు శివారు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. రహదారులపైకి నీరు పొంగిపొర్లుతోంది. దీంతో బెళగావిని గోవాతో కలిపే ప్రధాన రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాకుండా, శృంగేరి నుంచి మంగళూరుకు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గాన్ని కూడా మూసివేసినట్టు సమాచారం.