
Zeeshan Siddique: 'మీ నాన్నను చంపినట్లే నిన్నూ..': బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ కు బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ కుమారుడు,ఎన్సీపీ నేత జీషాన్ సిద్ధిఖీకి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు.
ఆయనను చంపేస్తామని, తన తండ్రిని ఎలా హత్య చేసారో అలా తనను హత్య చేస్తామనిపేర్కొంటూ, రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈఘటనపై పోలీసులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గతఏడాది అక్టోబర్ 12న ముంబైలో జీషాన్ కార్యాలయంలో బాబా సిద్ధిఖీ ఉన్న సమయంలో, దుండగులు అతనిపై తుపాకులతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ,చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
ఈ హత్యకు తామే కారణమని కిరాతకుల గ్యాంగ్ అయిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే అంగీకరించింది.
వివరాలు
సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్షదీప్ గిల్ అరెస్టు
తాజాగా వచ్చిన బెదిరింపు మెయిల్ విషయమై తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని జీషాన్ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన అక్షదీప్ గిల్‌ను పంజాబ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఈ దాడికి సంబంధించిన అసలు మాస్టర్‌మైండ్ అన్మోల్ బిష్ణోయ్ అని పోలీసులు తేల్చారు.