Page Loader
వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సాక్షిగా వైఎస్‌ షర్మిల
వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సాక్షిగా వైఎస్‌ షర్మిల

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సాక్షిగా వైఎస్‌ షర్మిల

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 21, 2023
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు వైఎస్‌ షర్మిలను సీబీఐ సాక్షిగా నమోదు చేసింది. షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ CBI కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ వాంగ్మూలం సమర్పించింది. గతేడాది అక్టోబర్‌ 7న దిల్లీలో షర్మిల సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. వివేకా మరణానికి ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, దానికి పెద్ద కారణమే ఉందన్నారు. అయితే తన వద్ద ఆధారాలేవీ లేవని, రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు. హత్యకు ఆర్థిక వ్యవహారాలు కారణాలు కావని, అవినాష్‌ కుటుంబానికి వివేకా వ్యతిరేకం కావడమే కారణంగా ఉండొచ్చన్నారు.

DETAILS

అవినాష్‌ కు టిక్కెట్ ఇవ్వకుండా జగన్‌కు సర్దిచెప్పుదామని వివేకా అన్నారు: షర్మిల

హత్యకు ముందు వివేకా తమ ఇంటికి వచ్చి తనను కడప ఎంపీగా బరిలోకి దిగాలని కోరినట్లు షర్మిల వెల్లడించారు. అవినాష్‌ కు ఎంపీగా టిక్కెట్ ఇవ్వకుండా జగన్‌కు సర్దిచెప్పుదామని తనతో చెప్పారన్నారు. మరోవైపు జగన్‌కు తాను వ్యతిరేకంగా వెళ్లనని వివేకా ఆలోచించేవారన్నారు.జగన్‌ తనకు మద్దతివ్వరు కనుక ఎంపీగా పోటీకి ఒప్పుకోలేదని షర్మిల అన్నారు. కానీ బాబాయ్‌ ఒత్తిడితో పోటీకి సరే అన్నట్లు షర్మిల వాంగ్మూలంలో తెలిపారు. ఎంపీగా వివేకాకు బదులు పోటీ చేయాలని మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని షర్మిలను ప్రశ్నించగా,ఎమ్మెల్సీగా ఓడటం వల్లే ఎంపీగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపలేదన్నారు. ఎమ్మెల్సీగా వివేకా ఓడిపోయేందుకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సహా సన్నిహితులే కారణమని షర్మిల చెప్పారు.కుటుంబంలో ఎప్పుడూ కోల్డ్‌ వార్‌ నడిచేదని వివరించారు.