Page Loader
CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ 
CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2024
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో సీఎం జగన్‌ సుమారు గంటన్నరపాటు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, తెలంగాణ నుంచి పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బకాయిలను సీఎం జగన్‌ ప్రస్తావించారు. ఈ భేటీ అనంతరం సీఎం జగన్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో సమావేశమై రాష్ట్రానికి నిధుల విడుదలపై చర్చిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో రాష్ట్రంలో పలు సర్వేలు వెల్లువెత్తడంతో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీతో  సీఎం జగన్‌ భేటీ