Page Loader
Pinelli Ramakrishna Reddy: వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌
Pinelli Ramakrishna Reddy: వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌

Pinelli Ramakrishna Reddy: వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2024
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత పిన్నెలి రామకృష్ణారెడ్డి పలు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉండడంతో నరసరావుపేటలో అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంలను ధ్వంసం చేయడం, అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై దాడికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన నాలుగు కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేస్తూ నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్‌లను బుధవారం ధర్మాసనం తిరస్కరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్