LOADING...
YCP MLA: ఓటరును చెంపదెబ్బ కొట్టిన తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే.. 
ఓటరును చెంపదెబ్బ కొట్టిన తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే..

YCP MLA: ఓటరును చెంపదెబ్బ కొట్టిన తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే.. 

వ్రాసిన వారు Stalin
May 13, 2024
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 లోక్‌సభ ఎన్నికల నాలుగో దశకు పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. ఈ సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఓటింగ్ జరుగుతోంది. సోమవారం పోలింగ్ బూత్‌లో తెనాలికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటరు చెంప పగలగొట్టారు. ఆ వెంటనే ఎమ్మెల్యే శివ కుమార్ చంపపై తిరిగి ఓటర్ దాడి చెయ్యడంతో.. శివకుమార్ మద్దతుదారులు ఓటరును కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Details 

ఎమ్యెల్యే పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

కాగా, ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్, పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇరువురు శాంతియుతంగా ఉండాలంటూ ఈసీ పేర్కొంది. ఓటరుపై ఎమ్మెల్యే దాడి చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి బీజేపీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీల కూటమి నుంచి సవాల్‌ ఎదురవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..