English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ
    తదుపరి వార్తా కథనం
    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ
    త్వరలో కాంగ్రెస్‌లోకి షర్మిల

    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 03, 2023
    10:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.

    ఏపీలోని విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలిసేందుకు వచ్చిన కేవీపీ మీడియాతో మాట్లాడారు.

    కాంగ్రెస్‌ వాదిగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు.

    ఈ క్రమంలోనే ఏపీలో పార్టీ బలం పుంజుకునేందుకు రాహుల్‌గాంధీకి రాష్ట్ర రాజకీయ పరిణామాలను, పరిస్థితులను వివరిస్తామన్నారు.

    కాగా దివంగత సీఎం వైఎస్సాఆర్ కు అంతరంగికుడిగా కేవీపీ పేరు గడించారు.

    DETAILS

    2024లో ఏపీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం : కేవీపీ

    షర్మిల, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాక, పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను షర్మిల నిర్వర్తించనున్నారని కేవీపీ వెల్లడించారు.

    ఏపీలో పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ సూచనలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ తరహాలో రాష్ట్రంలోనూ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు.

    2024 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2018లో తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు వల్లే కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా నష్టపోయిందన్నారు.

    ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్లీ పునరుత్తేజం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

    విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా వైసీపీ, టీడీపిలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు.

    కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏపీకి చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    వైఎస్ షర్మిల
    వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    కాంగ్రెస్

    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  రాహుల్ గాంధీ
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  రాహుల్ గాంధీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ

    వైఎస్ షర్మిల

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్

    వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)

    'నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు', వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025