TTD Ghee Issue: కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన వైవీ, భూమన
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలోని స్వతంత్ర విచారణకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసులో సిట్ దర్యాప్తు సరిపోదని, కేంద్రం తరఫున అధికారిని నియమించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
పిటిషనర్లతో పాటు టీటీడీ, కేంద్ర ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకుంటూ, సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో విచారణ చేపట్టాలని ఆదేశించింది.
వివరాలు
నెయ్యి కొనుగోలు నిర్ణయం తమది కాదు: వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వు కలిసినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ డైెరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతించారు.
వైసీపీపై నిందలు మోపుతూ దుష్ప్రచారం చేశారని దీనిపై విచారణలో నిజాలు బయటకు వస్తాయన్నారు.
మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు పాలకమండలికి సంబంధం లేదని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు.
ఆర్ డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు నిర్ణయం తమది కాదని స్పష్టం చేశారు, జూన్‌లో టీడీపీ వచ్చాక నెయ్యి సరఫరా జరిగిందని, దీని బాధ్యత ఎవరిదో విచారణలో తేలుతుందని తెలిపారు.