ఈ ఫుడ్ టేస్టీ గురూ.. 2023లో టాప్-5 వెరైటీ ఫుడ్ కాంబినేషన్‌ల జాబితా ఇదే
వెరైటీ ఫుడ్ కాంబినేషన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే రెండు విభిన్నమైన వంటకాలను కలపి సరికొత్త వంటకాన్ని(WEIRD) తయారు చేస్తారు. ఈ కాంబో ఫుడ్ ద్వారా కొందరు కొత్త టేస్ట్ ను ఎంజాయ్ చేస్తుంటారు.అదే సమయంలో మరికొందరికి వియర్డ్ కాంబో అనారోగ్యకరమైన ఆహారంగా కనిపిస్తుంది. గతేడాది మసాలా దోశ ఐస్ క్రీమ్, గులాబ్ జామూన్ బర్గర్, డ్రాగన్ ఫ్రూట్ టీ లాంటి విచిత్ర వంటకాల వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. 2023లోనూ అదే ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో బాగా వైరల్ గా మారిన వెరైటీ ఫుడ్ కాంబినేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భిండీ సమోసా
దిల్లీలోని చాందినీ చౌక్ వీధుల్లో భిండీ వాలా సమోసాలు ఫేమస్. ఈ ఏడాది ఓ ఫుడ్ బ్లాగర్ దీనికి సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఇందులో సమోసా పగలగొడితే,లోపల బెండకాయ కనిపిస్తుంది. సమోసా లోపల బెండకాయ జిగటగా అంటుకోకుండా ఉంటుదన్నది వ్యాపారి నమ్మకం అంతేకాకుండా ఇది మరింత టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామున్ దోశ ఈ ఏడాది గులాబ్ జామూన్ దోశ వీడియో వైరల్ గా మారింది. వేడి గ్రిల్‌పై ముందుగా దోశ వేశాడు. ఆపై 7- 8 గులాబ్ జామూన్‌లను గుజ్జుగా చేసి దోసకు బాగా పట్టించాడు.తర్వాత ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీం, గులాబ్ జామూన్‌ను అందులో ఉంచి వేడివేడిగా సర్వ్ చేస్తుంటే లొట్టలేసుకుంటూ తింటున్నారు.
గులాబ్ జామున్ దోస వీడియో
బిర్యానీ సమోసా తిన్నారా గురూ
ఈ ఏడాది బిర్యానీ సమోసా, విచిత్రమైన ఆహార కాంబినేషన్లో భాగంగా అంతర్జాలంలో వైరల్ అయ్యింది. సమోసా లోపల బంగాళదుంపలకు బదులు బిర్యానీ నింపి డీప్ ఫ్రై చేయడం దీని స్పెషాలిటీ. ఈ కాంబోకు వినియోగదారులను నుంచి అనాసక్తి వ్యక్తమవుతోంది. రుచికరమైన ఆహారాన్ని వేరేవాటితో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. చాక్లెట్ ఇడ్లీ కొన్ని నెలల క్రితం, చాక్లెట్ ఇడ్లీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. చాక్లెట్ ఇడ్లీ పిండిని అరటి ఆకుపై పెట్టి, ఒక ట్రేలో ఉంచి, ఆపై స్టీమర్‌లో పెట్టారు. తర్వాత ట్రేని బయటకు తీసి, ఇడ్లీపై చాక్లెట్ సిరప్ తోపాటు మిఠాయిని పూశాడు. అనంతరం చాక్లెట్ ఐస్‌క్రీమ్‌తో కలిపి వినియోగదారులకు సర్వ్ చేస్తున్నారు.
పుచ్కా చాప్ టేస్టే వేరబ్బా..
పుచ్కా చాప్ 2023లో వెరైటీ ఫుడ్ కాంబినేషన్‌ల జాబితాలో పుచ్కా చాప్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ మేరకు పుచ్కా చాప్స్ వీడియోను కోల్‌కతాకు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్ షేర్ చేశారు. ఇందులో సదరు మహిళా, చాలా రకాల తరిగిన కూరగాయలకు మెత్తగా ఉడికించిన బంగాళాదుంపల మిశ్రమాన్ని కలిపింది. అనంతరం దానికి కొంచెం మసాలాలు, ఉప్పు, పంచదార, చింతపండుతో పాటు తగిన మొతాదులో నీరు కలిపింది. తర్వాత ఈ మిశ్రమాన్ని పుచ్చకా, శనగపిండి మిశ్రమంలో ముంచి వాటిని వేడి వేడి బజ్జీలుగా చేసి వినియోగదారులకు హాట్ హాట్ గా సర్వ్ చేయడం వీడియోలో కనిపిస్తుంది.