
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
ఈ వార్తాకథనం ఏంటి
అక్షయ తృతీయ రోజున (ఏప్రిల్ 30) బంగారం కొనడం అత్యంత శుభమని విశ్వసించబడుతుంది.
అయితే బంగారంతో పాటు మరికొన్ని శుభవస్తువులను కూడా ఈ పుణ్యదినాన కొనుగోలు చేయవచ్చు.
అక్షయ తృతీయనాడు కొనడం వల్ల మనకు ధనదేవతల అనుగ్రహం లభిస్తుందని పూర్వీకుల నమ్మకం. మరి ఆ శుభవస్తువులెవి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
అక్షయ తృతీయ విశిష్టత:
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో అక్షయ తృతీయ ఒకటి.
ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ తిథినాడు జరుపుకుంటారు.
ఈ ఏడాది ఈ పండుగ ఏప్రిల్ 30న వస్తోంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున బంగారం, వెండి వంటి ఆభరణాలను కొనడం ఒక సాంప్రదాయంగా ఉంది.
అలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం, శుభతనం, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. అయితే బంగారం లేదా వెండి కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.
ఆర్థికంగా పరిమితులు ఉన్నవారు ఈ ఖరీదైన వస్తువులను కొనలేకపోతారు.
అలాంటి వారు కూడా శుభవస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ధన లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. మరి అలాంటి శుభవస్తువులు ఏమిటో చూడండి:
వివరాలు
1. బంగారం (Gold)
బంగారం లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, సముద్ర మథన సమయంలో బంగారం బయటకు వచ్చి విష్ణువుద్వారా స్వీకరించబడింది.
అందువల్ల బంగారాన్ని లక్ష్మీదేవికి సమానంగా భావించి, అక్షయ తృతీయనాడు బంగారాన్ని కొనడం ఒక శుభచిహ్నంగా భావిస్తారు.
ఈరోజు కొనుగోలు చేసిన బంగారం, ఆభరణాలు ఇంటికి సంపదను తీసుకొస్తాయని నమ్మకం ఉంది.
అంతేకాదు, ఈ రోజున తీసుకున్న ఆస్తి లేదా డబ్బు నశించదని, ఎప్పటికీ నిలిచి ఉంటుందని విశ్వసిస్తారు.
బంగారాన్ని కొనుగోలు చేసిన తరువాత పూజ చేసి, లక్ష్మీదేవి మరియు కుబేరునికి అర్పించడం శుభప్రదంగా భావించబడుతుంది.
వివరాలు
2. కొత్త ఇల్లు కొనుగోలు (New House Purchase)
వైశాఖ మాస శుక్ల తృతీయ తిథి అక్షయ తృతీయ పర్వదినంగా వస్తుంది. ఈ పవిత్రదినాన ప్రారంభించిన పనులు విజయం సాధిస్తాయని నమ్మకం.
ముఖ్యంగా కొత్త ఇల్లు కొనడం లేదా నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఉంది.
ఈ విధంగా లక్ష్మీదేవి గృహంలోకి అడుగుపెట్టి, కుటుంబానికి సుఖసంతోషాలు, పురోగతిని అందిస్తుందని విశ్వసించబడుతుంది.
వివరాలు
3. కొత్త వాహనం (New Vehicle)
ఈ సంవత్సరం మే 10న అక్షయ తృతీయ రానున్న నేపథ్యంలో, కార్లు, బైకులు వంటి వాహనాలను కొనడం శుభదాయకం. చాలా ఆటో మొబైల్ సంస్థలు ఈ రోజున ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంటాయి.
అనేక నగరాల్లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు అధికంగా ఉంటాయి. ఈ రోజు వాహనం కొనడం వల్ల ప్రయాణాలలో రక్షణ, విజయాలు లభిస్తాయని నమ్మకం.
4. వెండి వస్తువులు (Silver Items)
వెండి వంటి విలువైన లోహాల కొనుగోలు కూడా శుభఫలితాలను ఇస్తుంది.
వెండి నాణేలు,ఆభరణాలు,పాత్రలు మొదలైన వాటిని కొనుగోలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసించబడుతుంది.
ఈ వెండి వస్తువులను స్నేహితులు, బంధువులకు బహుమతిగా ఇచ్చినా మంచి ఫలితాలే.
వివరాలు
5. మట్టికుండ (Earthen Pot)
ప్రత్యేకించి వెండి నాణేలను పూజించి ఇంట్లోని లాకర్‌లో ఉంచితే సంపద పెరుగుతుందని పండితుల అభిప్రాయం.
ధనవంతులు బంగారు లేదా వెండి కుండలను కొనుగోలు చేస్తారు. అయితే అందరికీ అలా కొనడం సాధ్యపడదు.
అలాంటి వారు మట్టికుండలను కొనుగోలు చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చని నమ్మకం.
ఈ మట్టికుండలను ఇంట్లో ఉంచితే శుభవాతావరణం ఏర్పడుతుందని, ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా అక్షయ తృతీయ నాడు శుభవస్తువులను కొనడం ద్వారా మనం లక్ష్మీదేవి కృపకు పాత్రులు కావచ్చు.
ఖరీదైన వస్తువులు కాకపోయినా, మన సామర్థ్యానికి అనుగుణంగా ఈ శుభదినాన్ని స్మరణీయంగా మార్చుకోవచ్చు.