మీ జుట్టు వేగంగా, మందంగా పెరగాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
మన శరీరంలో మిగతా భాగాలకు ఇచ్చే ప్రాముఖ్య్త జుట్టుకు ఇవ్వము. జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టరు. జుట్టు ఊడిపోతున్నప్పుడే దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది. జుట్టు పలుచగా మారడం, ఊడిపోవడం, తలమీద వెంట్రుకలు తొందరగా పెరగకపోవడం వంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే కింద తెలియజేసే చిట్కాలు పాటించండి. జుట్టు ఎందుకు ఊడుతుంది? దీనికి అనేక కారణాలున్నాయి. సరైన ఆరోగ్యం తీసుకోకపోవడం, అనవసరమైన ఒత్తిడి, కొన్నిసార్లు వారసత్వం, వాతావరణ కాలుష్యం, అనారోగ్యం.. ఇలా చాలా ఉన్నాయి. సాధారణంగా ఒకరోజులో వంద వెంట్రుకలు ఊడిపోవడం సహజమేనని ట్రైకాలజీ నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ ఊడిపోతే అది సమస్యగా భావించాలి.
జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు, ఫాస్ట్ గా పెరగడానికి చేయాల్సిన పనులు
సరైన ఆహారం: మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఉండాలి. ప్రోటీన్ల వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. ఒకరోజులో 50గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం మంచిదని నిపుణుల అభిప్రాయం. కెఫైన్ ఉత్పత్తులు: కెఫైన్ తీసుకోవడం వల్ల ఒక్కసారిగా శక్తి వస్తుందని అందరికీ తెలుసు. కెఫైన్ కలిగిన షాంపూలను వాడటం వల్ల జుట్టు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఎసెన్షియల్ ఆయిల్స్: లావెండర్, పుదీనా, వెల్లుల్లి ఆయిల్స్ తో జుట్టుకు మర్దన చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది. ఈ ఆయిల్స్ ని జుట్టుకు మర్దన చేయాలనుకుంటే, కొబ్బరి నూనెలో కలిపి మర్దన చేయడం ఉత్తమం. 40మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి జుట్టుకు మర్దన చేయాలి.
హెయిర్ స్టైల్ సాధనాలే అతిపెద్ద శత్రువులు
హెయిర్ స్ట్రెయిట్నింగ్ వద్దే వద్దు: తడిగా ఉన్న జుట్టును పొడిగా మార్చే మిషన్లు, ఉంగరాల జుట్టును స్ట్రెయిట్ గా మార్చే సాధనాలు వాడకండి. ఈ సాధనాలు వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ వేడి వల్ల మీ జుట్టు ఊడిపోతుంది. మీ జుట్టు వేగంగా పెరగాలంటే ఇలాంటి ప్రయోగాలు మీరు చేయకండి. ఒత్తిడి వద్దంటే వద్దు: నువ్వెన్ని పనులు చేసినా, జుట్టు ఊడిపోకూడదని ఎన్ని రకాల సాధనాలు వాడినా, ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఒత్తిడి ఉంటే మాత్రం జుట్టు ఊడిపోవడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒత్తిడి, టెన్షన్, యాంగ్జాయిటీలను దూరం చేసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుందని తెలుసుకోండి.