
Akshay Trithya: అక్షయ తృతీయ రోజున ₹50,000 బడ్జెట్‌లో బంగారు ఆభరణాల కొనుగోలు చేయండి ఇలా..
ఈ వార్తాకథనం ఏంటి
అక్షయ తృతీయ సద్గుణాలు కలిగిన పవిత్రమైన రోజు. ఆ రోజు బంగారాన్ని కొనడం వల్ల ఐశ్వర్యం, శుభం,భాగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు.
అయితే ప్రస్తుత బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, తులం బంగారం కొనాలంటే లక్షా ముప్పైవేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
అయినా సరే, ₹50,000 బడ్జెట్‌లోనూ మీరు పలు చిన్న చిన్న బంగారు వస్తువులను తీసుకోవచ్చు.
దానికోసం ఎలాంటి వస్తువుల్ని ఎంపిక చేసుకోవాలో తెలుసుకోండి.
వివరాలు
1. బంగారు నాణేల ఎంపిక
₹50,000 బడ్జెట్‌లో 24 క్యారెట్ల బంగారు నాణాలు సులభంగా లభిస్తాయి. వీటిని ఇంట్లో భద్రపరచుకోవచ్చు.
భవిష్యత్తులో మళ్లీ ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఈ నాణాలను వాడుకొని ఏదైనా పెద్ద బంగారు వస్తువును తీసుకోవచ్చు.
అందుకే అక్షయ తృతీయ రోజున ఈ బడ్జెట్‌లో ఉండేవారు వీలైనంతవరకూ 24 క్యారెట్ల నాణాలను కొనుగోలు చేయడం మంచిది.
వివరాలు
2. స్టడ్స్, డ్రాప్స్ లాంటి చెవి ఆభరణాలు
22 క్యారెట్ల చిన్న చెవిపోగులు, డ్రాప్స్ తక్కువ ధరకు లభిస్తాయి. ఇవి ప్రతిరోజూ ధరించడానికి అనువుగా ఉండే డిజైన్‌తో ఉంటాయి.
₹50,000 బడ్జెట్‌లో వీటిని సులభంగా కొనొచ్చు. అలాగే సాధారణ బంగారు గొలుసులకు పెట్టుకునే లాకెట్లు లేదా పెండెంట్లు కూడా ఈ ధర పరిధిలో దొరుకుతాయి.
వీటి రూపకల్పన ఆకర్షణీయంగా ఉండడేమే కాక బలంగా కూడా తయారవుతాయి.
వివరాలు
3. పిల్లల కోసం ప్రత్యేకంగా
చిన్నారుల కోసం తయారు చేసిన బంగారు ఉంగరాలు, చెవిపోగులు వంటి చిన్న ఆభరణాలు కూడా ₹50,000 లోపే లభిస్తాయి.
తేలికపాటి చైన్లు కూడా ఈ ధర పరిధిలో వస్తాయి. కాబట్టి పిల్లలకు ఏదైనా ప్రత్యేకంగా కొనాలనుకుంటే, ఈ అక్షయ తృతీయే సరైన సమయం.
వివరాలు
4. మూడు నుండి నాలుగు గ్రాముల బరువు ఉన్నవి
బంగారు చెవిరింగులు లేదా ఉంగరాలు మూడు నుంచి నాలుగు గ్రాముల బరువులో తీసుకుంటే, ₹50,000 లోపే వస్తాయి.
ఇవి ప్రతిరోజూ ధరించడానికి అనువైనవి. నాలుగు గ్రాముల బరువు ఉండే ఉంగరం అయితే చేతిని నిండుగా కనపడేలా ఉంటుంది, అందంగా కూడా కనిపిస్తుంది.
వివరాలు
5. లైట్ వెయిట్ జ్యూయలరీ - స్టైలిష్, అందుబాటులో
ఇప్పట్లో లైట్ వెయిట్ ఆభరణాలు చాలానే డిమాండ్‌లో ఉన్నాయి. ఇవి తక్కువ బరువుతో ఉండి, ఫ్యాషన్‌ను ప్రతిబింబించేలా ఉంటాయి.
అయితే వీటిని ఎంతో జాగ్రత్తగా వాడాలి. ₹50,000 బడ్జెట్‌లో మీరు నాలుగు గ్రాముల బరువున్న ఆభరణాన్ని ఎంచుకుంటే, జీఎస్టీ, మేకింగ్ చార్జీలు కలిపినా మీరు మీ బడ్జెట్‌కు మించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.
వివరాలు
6. బంగారమే కాదు - వెండి వస్తువులు కూడా మంచి ఎంపిక
అక్షయ తృతీయ రోజున బంగారమే తప్పనిసరి కాదు. మీరు ₹50,000 బడ్జెట్‌లో వెండి వస్తువులు కూడా కొనొచ్చు.
వెండి దీపాలు, కుందులు, పళ్లెం వంటి వస్తువులు ఈ ధర పరిధిలో దొరుకుతాయి. ఇవి శుభ కార్యాల్లో ఉపయోగించడానికి కూడా అనుకూలం.
ఈ అక్షయ తృతీయ రోజున మీ బడ్జెట్ ₹50,000 అయితే, తెలివిగా ఎంపికలు చేసుకుంటే అందమైన, విలువైన ఆభరణాలను మీరు పొందొచ్చు.
ఎక్కువ ఖర్చు చేయకుండా, మీ బడ్జెట్‌లోనే శ్రేష్ఠమైన వస్తువులను సంపాదించగలిగే అవకాశం ఉంటుంది.