NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / UNESCO: యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ 
    తదుపరి వార్తా కథనం
    UNESCO: యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ 
    యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ

    UNESCO: యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    02:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చైనా సాంప్రదాయ టీ తయారీని చేర్చారు.

    చైనాలో టీ ప్రజల రోజువారీ జీవితంలో లోతుగా అల్లుకున్న పానీయం, ఇది సామాజిక, సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

    బీజింగ్ టీ మ్యూజియంలో ఉత్తర-దక్షిణ రాజవంశాల కాలం నాటి 100కి పైగా టీ-సంబంధిత కళాఖండాల సేకరణ ఉంది.

    అక్కడ కాలిగ్రఫీ, పెయింటింగ్‌లు, సాంస్కృతిక అవశేషాలు, పురాతన టీ సెట్‌లు, టీ నమూనాలు ఉన్నాయి, ఇవి చైనా గొప్ప టీ సంస్కృతి క్రమబద్ధమైన రూపాన్ని చూపిస్తాయి.

    వివరాలు 

    2022లో యునెస్కో వారసత్వ జాబితాలో..

    ఈ మ్యూజియం అంతర్జాతీయ టీ సంస్కృతిని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంది.

    ఇది విద్యార్థులకు సాంప్రదాయ సాంస్కృతిక విద్యా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు విదేశీ దౌత్యవేత్తలకు టీ సంస్కృతిని పరిచయం చేస్తోంది.

    చైనీస్ ప్రజలు టీ తయారీలో ఉపయోగించే పద్ధతులు,వస్తువులు విదేశీ రాయబారులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

    స్థానికంగా తూర్పు ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ఆకులతో రకరకాల టీలను తయారు చేసే విధానం ప్రత్యేకతను చాటుతోంది.

    చైనా సాంప్రదాయ టీ తయారీ పద్ధతులు,అనుబంధ సామాజిక విధానాలు 2022లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి.

    చైనీయుల జీవితంలో టీ ఒక ముఖ్యమైన భాగమైంది.

    వివాహాలు, సమూహ వేడుకలు వంటి సందర్భాల్లో కూడా టీ ప్రాముఖ్యత కలిగి ఉంది. టీ పూర్వం చైనీస్ ఔషధ గ్రంథాలలో విరుగుడుగా ప్రస్తావించబడింది.

    వివరాలు 

    "గోల్డెన్ మెలోన్ ట్రిబ్యూట్ టీ,"

    టీ తాగే ధోరణి టాంగ్ రాజవంశం కాలంలో (618-907) ప్రారంభమైంది.టాంగ్ పండితుడు లు యు రాసిన "క్లాసిక్ ఆఫ్ టీ" టీ అభ్యాసాలపై వివరాలను అందించిన మొదటి గ్రంథం.

    1987లో పురావస్తు శాస్త్రవేత్తలు టాంగ్ ఇంపీరియల్ టీ సెట్‌ను కనుగొన్నారు.సాంగ్ రాజవంశం (960-1279) సమయంలో టీ ప్రజాదరణ పొందింది,మ్యూజియం కుడ్యచిత్రాలు టీ పోటీలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తాయి.

    మ్యూజియంలోని అరుదైన అంశం"గోల్డెన్ మెలోన్ ట్రిబ్యూట్ టీ," ఇది దాని గుమ్మడికాయ ఆకారంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

    ఈ ప్యూర్ టీ ఒక శతాబ్దానికి పైగా భద్రపరచబడింది. ఆకుపచ్చ, పసుపు, ముదురు, తెలుపు, బ్లాక్ టీలు చైనాలో ప్రసిద్ధి చెందాయి. కొత్త తరం చైనీస్ టీని పాలు, బెర్రీలు, పండ్లతో కలిపి కొత్త రుచులతో అన్వేషిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    చైనా

    China: చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ లేక నానా తంటాలు అంతర్జాతీయం
    China: నాలుగు సరిహద్దు ప్రాంతాల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకున్న చైనా  ప్రపంచం
    Typhoon Bebinca: 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలమైన తుపాను.. చైనాను వణికిస్తున్న 'బెబింకా' అంతర్జాతీయం
    China: బరితెగిస్తున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌ సమీపంలో కొత్త హెలిపోర్ట్ నిర్మాణం  అరుణాచల్ ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025