అగ్నిపర్వతాలు బద్దలై డైనోసర్ జాతి అంతరించినా బొద్దింకలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. ఎలాగో తెలుసా?
బొద్దింకలు మానవులకు నచ్చవు. వీటిని వేలేసిన జీవుల్లాగా చూస్తారు. కానీ నిత్యం వంటింటిలో తిరిగే జీవుల్లో ఇదొకటి. కిచెన్ లో బొద్దింకలు కనిపిస్తే కర్ర తీసుకుని టంగున వాటిని కొడతాం, లేదా వాటిని తరిమేస్తాం. కానీ తాజాగా శాస్త్రవేత్తలకు మాత్రం ఈ జీవుల గురించి ఓ అరుదైన విషయం తెలిసింది. వాటికి ఉన్న ప్రత్యేక సామర్ధ్యాల వల్ల బయో సైంటిస్టులు వీటివి స్పెషల్ లివింగ్ బీయింగ్స్ గా పరిణిగణిస్తున్నారు. సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం, ఒక గ్రహ శకలం భూమిని ఢీకొంది. అయితే అప్పట్లో భూమిపై ఉన్న జీవుల్లో దాదాపు మూడోంతులు చచ్చిపోయాయి. కానీ బతికివున్న జీవజాతుల్లో బొద్దింకలు ఉండటం గమనార్హం.
అగ్ని పర్వతాలు బద్దలై భారీ కాయాలు రాక్షసబల్లులు అంతరించిపోయాయి
మెక్సికోలోని చిక్సులబ్ ఏరియాను ఓ భారీ గ్రహశకలం ఢీకొనగా, భారీ పగుళ్లతో ఓ లోయ ఏర్పడింది. దీంతో రాక్షసబల్లులు అంతరించిపోయాయి. కానీ కొన్ని జీవులు మాత్రమే బతకి బట్టకట్టగలిగాయి. వాటిలో బొద్దింకలూ ఉన్నాయి. గ్రహశకలం ఢీకొట్టడంతో భూమిపై భారీగా కాలుష్యం ఏర్పడి చాలా అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. బూడిద వాయువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందాయి. దీని కారణంగా సమస్త ప్రాణులకు కావాల్సిన సూర్యరశ్మి భూమిపై చాలా కాలం పడలేదు. మొక్కలు, చెట్లు ఎక్కడికక్కడ ఎండిపోవడం మొదలైంది. ఈ క్రమంలో మొక్కలనే తిని బతికే జీవులు ప్రాణాలు కోల్పోవడంతో మెల్లగా కొన్ని జాతులు అంతరించిపోయాయి. అయితే 2 అంగుళాల పొడవుండే అతి చిన్న ప్రాణులైన బొద్దింకలు మాత్రం ఎలా బతికాయి అన్నది అతిశయోక్తి.
బొద్దింకలు సర్వభక్షక జీవులు
కాక్రోచస్ మిగతా జీవులు వెళ్లలేని ప్రదేశాల్లోకి, చిన్న చిన్న తొర్రల్లోకి సులువుగా దూసుకెళ్లగలవు. అందుకు కారణం వాటికి ఉండే చదునైన శరీరమే. చిక్సులబ్ గ్రహశకల ఘటన నుంచి బొద్దింకలు అవలీలగా బయటపడగలిగాయి. గ్రహశకలం ఢీకొట్టిన క్రమంలో భూమిపై వేడి ఉన్నఫలంగా విపరీతంగా పెరిగిపోయింది. ఈ విపరీత విపత్కర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు కుదరదు. అలాంటి సమయంలో బొద్దింకలు, ఆ వేడి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు మట్టి పగుళ్లలో దాక్కోవడం విశేషం. మొక్కల్ని తినే ప్రాణులు, కొన్ని రకాల జంతువులు చనిపోయినా, బొద్దింకలు జీవిస్తున్నాయంటే దానికి కారణం అవి సర్వభక్షక జీవులు. దొరికిన ఆహారం తింటూ ప్రాణాలను కాపాడుకోగలిగే శరీర వ్యవస్థ వీటికి వరం.
ఆపదలో గుడ్డు పెట్టెల్లోకి దూరిపోయి ప్రాణాలను కాపాడుకుంటాయి
బొద్దింకలు ఇతర జీవాల అవశేషాలను సైతం తినగలవు కాబట్టే వీటికి ఆహార కొరత రాలేదు. పెద్ద పెద్ద ప్రళయాల్లోనూ ఇవి సమర్థంగా ప్రాణాలు నిలుపుకోగలగడం ఆశ్చర్యకరం. బొద్దింకలకు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే, వాటి గుడ్లు చాలా సేఫ్ గా ఉంటాయి. చాలా సురక్షితమైన షెల్‌లో గుడ్లు పెడతాయి. ఎండు ధాన్యాల లాగా కనిపించే ఈ గుడ్డు పెట్టెలను ఊథెకే అంటారు. ఈ గుడ్ల పెంకులు చాలా గట్టిగా ఉండటం కొసమెరుపు. ఇది ప్రమాదాల నుంచి బొద్దింకలను రక్షించేందుకు పని చేస్తుంది. చాలా బొద్దింకలు ఆపదలో, పెను విధ్వంసాలు సంభవించే కాలంలో ఈ పెంకుల్లోకి దూరిపోయి తమ ప్రాణాలను కాపాడుకుంటాయి.
ఆస్తమా అలెర్జీ కారకాలు ఈ బొద్దింకలు
ఈ బొద్దింకల్లోని అనేక జాతులు మానవుల చుట్టే కనిపిస్తుంటాయి. ఇవి మనుషులు ఏర్పడకుండా, పెద్దగా తెలియకుండానే అనేక రోగాలను కలగజేయగలవు. బొద్దింకలు అలెర్జీ కణాలను ఉత్పత్తి చేస్తాయి. అంతేనా, ఆస్తమా, అలెర్జీ లాంటివి వ్యాప్తి చేయగలవు. బొద్దింకలు క్రిమి సంహారకాలను సైతం తట్టుకుని నిలబడగలవు. కనుక వీటిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మరో విషయం ఏంటంటే బొద్దింకలు నలిగిపోయినప్పటికీ తిరిగి బతకగలవు. వీటి శరీర నిర్మాణం ఏమిటి అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్ లో గ్రహశకలం గానీ భూమిని ఢీకొడితే బొద్దింకల కంటే మానవ జాతి అంతరించిపోయే ప్రమాదమే ఎక్కువ ఉంటుందని పరిశోధనల గత ఫలితాలు చెబుతుండటం గమనార్హం.