
MS Dhoni : ధోనీ బైక్స్, కార్ల కలెక్షన్స్ ఇవే.. ఇన్ని ఎందుకని ప్రశ్నించిన సాక్షి!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులు, కార్లు అంటే ఎంతో ఇష్టం. ధోనీ వద్ద పాతకాలం బైకుల నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే హైఎండ్ మోడల్ బైక్స్ వరకూ అన్నీ ఉన్నాయి.
తాజాగా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, రాంచీలోని ధోనీ ఇంటికెళ్లారు. అక్కడ గ్యారేజీలో ఉన్న వందలాది కార్లు, బైకుల కలెక్షన్స్ ను వీడియో తీసి వెంకటేష్ ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
బైక్‌లంటే ఇంత పిచ్చి ఉన్న వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదని వెంకటేష్ ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Details
ఎంఎస్ ధోనీ ఇంట్లోనే బైక్ షోరూం..?
వెంకటేష్ ప్రసాద్ షేర్ చేసిన వీడియోపై ధోనీ సతీమణి సాక్షి సింగ్ స్పందించింది. వెంకటేష్ ప్రసాద్ తో మీరు రాంచీ రావడం ఇదే మొదటిసారా అని సాక్షి సింగ్ అడిగింది. తాను నాలుగోసారి రాంచీకి వచ్చానని అయితే ధోనీ ఇంటికి రావడం మొదటిసారి అని వెంకటేష్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇక్కడ ఇన్ని బైకులు ఉన్నాయంటే ధోనీకి బైక్స్ అంటే ఎంత పిచ్చో ఇప్పుడు తెలిసిందని చెప్పారు. దీనిపై సాక్షి సింగ్ బదులిస్తూ ఇది కచ్చితంగా పిచ్చే నని, తాను కూడా ఇన్నీ బైకులు అవసరమా అని చెప్పానని ప్రశ్నించింది.
దానికి ధోనీ స్పందిస్తూ తనకు సంబంధించినవన్నీ తీసుకున్నావు అని, తనకు మిగిలింది ఇదొక్కటేనని సరాదాగా సాక్షిసింగ్ కి ధోనీ బదులిచ్చాడు.