Diabetes : డయాబెటీస్ రాకూడదంటే స్వీట్లు మానేస్తే చాలదు.. ఇంకా ఏమేం మానేయాలో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.ఆహారపు అలవాట్లు, జీవన శైలే కారణంగా ఇటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అయితే మానవ శరీరం ఈ వ్యాధి బారిన పడితే శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఏదైనా కారణంగా పుండ్లు ఏర్పడితే అంత ఈజీగా తగ్గే అవకాశం ఉండదు.
ఇదే సమయంలో డయాబెటీస్ పేషెంట్లు చక్కెర పదార్థాలు తినకూడదని నియంత్రణలుంటాయి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతంగా పెరుగుతాయి.
దీంతో ఈ వ్యాధి రాకూడదంటే షుగర్ పదార్థాలు తినకపోతే సరిపోతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.ఇందులో నిజం ఎంత మాత్రం లేదు.
details
డయాబెటీస్ రావొద్దంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే :
ఒక్క తీపి పదార్ధాలతోనే డయాబెటీస్ రాదు. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ విషయాలు కారణంగా నిలుస్తాయి.
వ్యాయామం చేస్తే శరీరం ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండమే కాకుండా ఎన్నో రోగాల బారిన పడకుండా ఉండగలుగుతాం.
మధుమేహం నియంత్రించాలంటే రోజు వారీగా కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు శారీరక శ్రమ అవసరం.
వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ లాంటివి చేస్తే డయాబెటీస్ సహా అనేక రోగాలు దరిచేరకుండా ఉంటాయి.
details
జంక్, ఫ్రైడ్, ప్రాసెస్ ఫుడ్ తింటే డయాబెటీస్ ముప్పు ఎక్కువ
సరైన వ్యాయామం హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుందని నిపుణలు అంటున్నారు. మరోవైపు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలు రుచికరంగా ఉంటాయి. ఫలితంగా వాటిని సాధారణంగా వదులుకోలేకపోతుంటారు.
ఆరోగ్యంగా జీవించాలంటే, సమతుల్య ఆహారాలను తినాల్సి ఉంటుంది. ఒకేసారి కాకుండా రోజుకు మూడు, నాలుగు సార్లు తక్కువ మోతాదులో తింటే ఆరోగ్యకరం.
ఇదే సమయంలో పండ్లు, ఫ్రెష్ కూరగాయలను ఎక్కువగా తినడం శ్రేయస్కరం. జంక్, ఫ్రైడ్, ప్రాసెస్ ఫుడ్ తింటే డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.
DETAILS
చక్కెర బదులుగా బెల్లం తింటే ఆరోగ్యకరం
ఉప్పు, పంచదారపై కంట్రోల్ ఆరోగ్యకరం. కానీ అవసరానికి మించి తింటే రోగాలు ఖాయం. చక్కెరను రాత్రిపూట వీటిని మొత్తమే తినకపోవడం ఉత్తమం. బదులుగా బెల్లం తింటే ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ధూమపానం, మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటితో చాలా రోగాలు వెంటాడుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగి ఊబకాయం బారినపడతారు.
ఫలితంగా డయాబెటిస్ రోగం వెంటాడుతుంది. ప్రీ డయాబెటిక్ ఉన్నవారు బరువు తగ్గితే డయాబెటిస్ ను ఈజీగా నివారించొచ్చు. డయాబెటిస్ పేషెంట్లు ఇది గమనించాలి.
బాడీ మాస్ ఇండెక్స్ 18, 23 మధ్య ఉంటే మీ సమస్య దాదాపుగా తగ్గినట్లే. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవాటినే తినాలి.