
Diwali 2024: దీపావళికి ఈ సింపుల్ టిప్స్ తో మీ ఇంటిని అలంకరించుకొండి
ఈ వార్తాకథనం ఏంటి
హిందువులు ఘనంగా జరుపుకునే పండగలలో దీపావళి ముఖ్యమైనది. ఇది చీకట్లను తొలగించి, వెలుగులను నింపడమే కాకుండా, పటాకులు కాలుస్తూ సందడి చేయడం కూడా.
దీపావళి రోజున ఇంటిని అందంగా అలంకరించడం చాలా మంది ఆసక్తి తో చేస్తారు.
అలాంటి వారికి కొన్ని సులభమైన ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించి ఇంటిని అలంకరించుకుంటే దీపావళి పండగకు మరింత శోభ వస్తుంది.
వివరాలు
దీపావళికి ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..
లోటస్ టోరన్: ఇది చాలా సాంప్రదాయిక లుక్ ను ఇస్తుంది. వీటిని మామిడాకుల ప్లేస్ లో కడితే అందంగా ఉంటుంది. పండుగల సమయంలో మళ్లీ వాడుకోవడానికి వీలైనది.
హ్యాండ్ క్రాఫ్టెడ్ దియాలు: ఇవి ఇంటికి ప్రత్యేకమైన లుక్ ను ఇస్తాయి. ఈ దియాలను ఇంటి సీలింగ్ లేదా పూజా గదిలో బాగా డెకరేట్ చేయవచ్చు. ఇవి వివిధ రకాలలో అందుబాటులో ఉంటాయి.
లోటస్ గ్లాస్ టీ లైట్ హోల్డర్: ఈ హోల్డర్ హై క్వాలిటీ గ్లాస్ తో తయారు చేస్తారు. దీపాలను అందంగా అలంకరించడానికి దీనిని ఉపయోగించవచ్చు.
దీపావళి వాల్ డోర్ హ్యాంగింగ్ డెకర్: ఇవి ఇంటికి ట్రెండీ, సాంప్రదాయిక లుక్ ను ఇస్తాయి.
వివరాలు
దీపావళికి ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..
వెల్వెట్ హ్యాండ్‌మేడ్ వాల్ డెకర్: లోటస్ డిజైన్లు ఇంటికి మంచి శోభను తెస్తాయి. వీటిని గుమ్మం దగ్గర లేదా వాల్ కి హ్యాంగ్ చేస్తే పండుగ శోభ వృద్ధి చెందుతుంది.
ముగ్గులు: ఈ దీపావళికి ఇంటి ఆవరణలో అందమైన ముగ్గులు వేయడం మర్చిపోకండి. రంగురంగుల ముగ్గులు ఇంటి శోభను పెంచుతాయి. దేవుడి పూజ గదిలో కూడా చిన్న రంగోలి వేయండి.
పువ్వులు: ముగ్గులను అందంగా తీర్చిదిద్దడానికి పువ్వులను ఉపయోగించవచ్చు. విభిన్న రంగుల పూలతో ఇంటిని అలంకరించడం ఎంతో అందంగా ఉంటుంది.
నీటి గిన్నెలో పూలు: ఒక గిన్నెలో నీటిని నింపి, అందులో పువ్వులను అలంకరించండి. ఆపై పువ్వుల డిజైన్ లో ఒక దీపం పెట్టండి. ఇది ఇంటి అందాన్ని పెంచుతుంది.
వివరాలు
బడ్జెట్ ఫ్రెండ్లీ.. అలంకరణ వస్తువులు
చిన్న చెట్లు: ఇంటి ఆవరణలో ఉన్న చిన్న చెట్లకు లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. రంగు రంగుల లైటింగ్ చెట్టు కొమ్మ చుట్టూ మెరిసేలా చేస్తుంది.
ఈ అలంకరణకి సంబదించిన వస్తువులు ఫ్యాన్సీ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.. లేదా మీరు ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.
ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ కావడంతో, ఇంటిని అందంగా అలంకరించడానికి చక్కని ఎంపికలు అవుతాయి.