Page Loader
PF Withdraw: పీఎఫ్ విత్‌డ్రా.. ఎప్పుడు, ఏ సందర్భాల్లో తీసుకోవచ్చో తెలుసా!
పీఎఫ్ విత్‌డ్రా.. ఎప్పుడు, ఏ సందర్భాల్లో తీసుకోవచ్చో తెలుసా!

PF Withdraw: పీఎఫ్ విత్‌డ్రా.. ఎప్పుడు, ఏ సందర్భాల్లో తీసుకోవచ్చో తెలుసా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2024
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిఎఫ్ అంటే ఫ్రావిడ్ ఫండ్ అని, ఇది సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) దీనిని నిర్వహిస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఇదే మొత్తాన్ని కంపెనీ కూడా జమ చేయాలి.ఇందులో 3 శాతం పీఎఫ్ అకౌంట్‌కు వెళ్తే, మిగిలిన 8 శాతం ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో పీఎఫ్ నిధులపై కేంద్రం వడ్డీ అందిస్తుంది. ప్రస్తుతం ఇది 8.25 శాతం. పీఎఫ్ అకౌంట్‌లో జమవుతున్న డబ్బులు సాధారణంగా రిటైర్మెంట్ కోసం, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు.

Details

పీఎఫ్ డబ్బులు ఎప్పుడెప్పుడు విత్‌డ్రా చేయవచ్చు? 

1. రిటైర్మెంట్ సమయంలో: ఉద్యోగం పూర్తయిన తర్వాత రెండు నెలల నిరుద్యోగిత తర్వాత మొత్తం విత్‌డ్రా చేయవచ్చు. 2. వైద్య అవసరాలు: బేసిక్ జీతానికి 6 రెట్లు లేదా పీఎఫ్ బ్యాలెన్స్‌లో ఉద్యోగి వాటా (వడ్డీతో కలిపి)లో ఏది తక్కువ అయితే, ఆ మొత్తం తీసుకోవచ్చు. 3. వివాహం లేదా చదువుల కోసం: కుటుంబసభ్యుల పెళ్లి, పిల్లల విద్య కోసం మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. 4. ఇంటి స్థలం కొనుగోలు/నిర్మాణం: కొత్త ఇల్లు నిర్మాణం, స్థలం కొనుగోలు, హోం లోన్ పేమెంట్స్ కోసం డబ్బు తీసుకోవచ్చు. 5. ఉద్యోగి మరణించినప్పుడు: కుటుంబ సభ్యులు పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేయవచ్చు.

Details

 పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ 

- ఆన్‌లైన్ విధానం - యూఏఎన్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. - కేవైసీ ప్రక్రియ పూర్తి అయి ఉండాలి. - ఆధార్, మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. -ఇ-నామినేషన్ ఫైల్ చేయాలి. - ఆఫ్‌లైన్ విధానం: - ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫారమ్‌ను నింపి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి.

Details

 విత్‌డ్రా కోసం అవసరమైన డాక్యుమెంట్లు 

1. యూఏఎన్ నంబర్ 2. బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ 3. ఆధార్, పాన్ కార్డు 4. ఫారం-19, ఫారం-31 5. పీఎఫ్ జాయినింగ్ డేట్ 6. క్యాన్సిల్డ్ చెక్ 7. రిటైర్మెంట్ డేట్ లేదా నిరుద్యోగత వివరాలు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడంలో మారిన విధానం ఈపీఎఫ్ఓ తాజాగా పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ ప్రక్రియను ఆటోమేటెడ్ చేసి, క్లెయిమ్‌లు త్వరగా సెటిల్ చేయడానికి మార్పులు చేసింది. పీఎఫ్ డబ్బులు ఉద్యోగ జీవితం చివర్లో అవసరానికి ఉపయోగపడేలా దాచుకోవడం ఉత్తమం. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే విత్‌డ్రా చేయడం సురక్షితం.