Page Loader
Summer Travel:గిర్ నేషనల్ పార్క్ కి వెళ్ళడానికి..ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ? 
గిర్ నేషనల్ పార్క్ కి వెళ్ళడానికి..ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ?

Summer Travel:గిర్ నేషనల్ పార్క్ కి వెళ్ళడానికి..ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ? 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2025
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న సింహాలు,పులులను దగ్గరగా చూసే కోరిక చాలామందికి ఉంటుంది. అయితే,అందుకోసం అడవిలోకి వెళ్లే ధైర్యం అందరికీ ఉండదు.కానీ గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ లో జంగిల్ సఫారీ కి వెళితే, మీరు పూర్తి భద్రతతో,నేరుగా అడవిలో తిరుగుతున్న వీటిని చూడవచ్చు. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది.ఈ పార్క్‌కు చేరుకోవడానికి వివిధ రవాణా మార్గాలు ఉన్నాయి. విమానంలో వెళ్లాలనుకుంటే,రాజ్‌కోట్‌లోని కిషోర్ కుమార్ గాంధీ విమానాశ్రయం పార్క్‌కు 160 కి.మీ. దూరంలో ఉంది. మరో ప్రత్యామ్నాయంగా డయ్యూ విమానాశ్రయం గిర్‌కు 110 కి.మీ. దూరంలో ఉంది. ఈ విమానాశ్రయాల నుంచి టాక్సీ లేదా బస్సు ద్వారా గిర్ నేషనల్ పార్క్ చేరుకోవచ్చు.

వివరాలు 

జంగిల్ సఫారీ వివరాలు 

రైలులో రావాలనుకునేవారికి జునాగడ్ రైల్వే స్టేషన్ (80 కి.మీ. దూరంలో) వేరావెల్ రైల్వే స్టేషన్ (70 కి.మీ. దూరంలో) ముఖ్యమైన స్టేషన్లు. వీటికి చేరుకున్న తర్వాత, టాక్సీ ద్వారా పార్క్‌కు వెళ్లవచ్చు. గిర్ నేషనల్ పార్క్‌లో జంగిల్ సఫారీ కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడికెళ్లి కూడా టిక్కెట్లు పొందవచ్చు. సఫారీ షెడ్యూల్: ఉదయం 6:00 - 9:00 ఉదయం 9:00 - మధ్యాహ్నం 12:00 మధ్యాహ్నం 3:00 - 6:00 రోజుకు మూడు ట్రిప్‌లు మాత్రమే ఉంటాయి. ఎక్కువ మంది సందర్శకులు వస్తారని భావించి, ముందుగా బుక్ చేసుకోవడం ఉత్తమం.

వివరాలు 

గిర్ నేషనల్ పార్క్ సందర్శించడానికి ఉత్తమ సమయం 

గిర్ నేషనల్ పార్క్ సందర్శించడానికి మార్చి-మే మధ్య వేసవి కాలం ఉత్తమం. వర్షాకాలం జూన్-సెప్టెంబర్ మధ్య పార్క్‌ను మూసివేస్తారు. గిర్‌లో వసతి సౌకర్యాలు గిర్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో హోటల్స్, రిసార్టులు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ముందుగా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్లాక కూడా వసతి పొందవచ్చు. జంగిల్ సఫారీ టికెట్ ధరలు జీపు బుకింగ్: ₹2500 - ₹4500 (4-8 మంది ప్రయాణించవచ్చు) గైడ్ ఫీజు: ₹500 పర్మిషన్ ఫీజు: ₹800 - ₹1000 ఒక్క వ్యక్తికి సఫారీ టికెట్: ₹1000

వివరాలు 

హైదరాబాద్ నుంచి గిర్ నేషనల్ పార్క్ ఎలా వెళ్లాలి? 

రైలు మార్గం: సికింద్రాబాద్ - రాజ్‌కోట్ కాచిగూడ - రాజ్‌కోట్ రైలు టికెట్ ధర: ₹650 - ₹2040 విమాన మార్గం: హైదరాబాద్ - ముంబై - రాజ్‌కోట్ హైదరాబాద్ నుంచి నేరుగా రాజ్‌కోట్ విమాన టికెట్ ధర సగటుగా ₹5000 ఉంటుంది. ఈ వేసవి సెలవుల్లో, గిర్ నేషనల్ పార్క్ సందర్శించి, అడవిలో స్వేచ్ఛగా సంచరించే సింహాలు, పులులను ప్రత్యక్షంగా చూసే అవకాశం మిస్ అవ్వకండి!