NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Heart Attack : గాలి కాలుష్యంతో గుండెపోటు వస్తుందని తెలుసా.. ఈ 7 చిట్కాలు పాటించాల్సిందే
    తదుపరి వార్తా కథనం
    Heart Attack : గాలి కాలుష్యంతో గుండెపోటు వస్తుందని తెలుసా.. ఈ 7 చిట్కాలు పాటించాల్సిందే
    గాలి కాలుష్యంతో గుండెపోటు.. ఈ 7 చిట్కాలు పాటించాల్సిందే

    Heart Attack : గాలి కాలుష్యంతో గుండెపోటు వస్తుందని తెలుసా.. ఈ 7 చిట్కాలు పాటించాల్సిందే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 07, 2023
    02:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో వాయుకాలుష్యం విపరీత స్థాయికి మించి పెరిగిపోవడం రాజధాని వాసులతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

    మరోవైపు దీపావళి పండుగ సందర్భంగా పెరిగే కాలుష్యానికి అద్దే ఉండదు. బాణసంచా కారణంగా తీవ్రమైన కాలుష్యానికి కారణంగా మారుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

    ఇదే సమయంలో వాయు కాలుష్యం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఊపిరితిత్తులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, గుండెకూ చెడు చేస్తుందని అంటున్నారు. వాయు కాలుష్యం హృద్రోగ సమస్యలకు కారణమంటున్నారు.

    దీర్ఘకాలం పాటు వాయుకాలుష్యంతో గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని 'నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్' వెల్లడించింది.

    కలుషిత గాలితో శరీరంలోని కణాలు రక్తంలోకి చేరి గుండె వరకు చేరుకుంటాయని పేర్కొంది.

    details

    ఎక్కువకాలం వాయు కాలుష్యంతో ఉంటే గుండె పోటు ముప్పు

    ఇలాగే దీర్ఘకాలం పాటు వాయు కాలుష్యం కొనసాగితే గుండె పోటు ముప్పు ఎక్కువేనంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.

    1. వాయు కాలుష్యంతో రక్తం గడ్డకట్టే ప్రమాదం

    2. శరీరంలోని ఇతర భాగాలకు రక్తం అందించేందుకు రక్తాన్ని వేగంగా పంప్ చేయాల్సి పరిస్థితిలో రక్తపోటు పెరుగుతుంది.

    3.దీంతో గుండె కండరాల్లో ఒత్తిడి పెరిగి వ్యాకోచిస్తాయి. ఈ మేరకు హార్ట్‌బీట్‌ను నియంత్రించే ఎలక్ట్రికల్ సిస్టం దెబ్బతింటుంది.

    4. ఈ క్రమంలోనే హార్ట్ రేట్ అదుపుతప్పి హార్ట్ ఫెయిల్యూర్ జరిగే ముప్పు పొంచి ఉంటుంది.

    5. హృద్రోగ బాధితుల్లో హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువ.

    6. కాలుష్యం గుండెకు ప్రధాన శత్రువు

    7. కాలుష్యం రక్త నాళాలను కుంచిస్తుంది. దీంతో రక్త సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం.

    details

    మద్యపానం, ధూమపానం, మాంసపానం అలవాట్లకు దూరం ఉండాలన్న నిపుణలు

    కాలుష్యాన్ని తప్పించడమెలా..

    వాయు కాలుష్యం నుంచి దూరంగా ఆరోగ్యంగా జీవించాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఫలితంగా రోగాలతో పోరాడేందుకు శరీరానికి అందాల్సిన రోగ నిరోధక శక్తి అందుతుంది.

    ఆహారంలో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలి. ఆకు కూరగాయలు, తృణ ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.

    తగినంత నీటిని తీసుకుంటూనే, గోరువెచ్చని నీటిని సేవిస్తుండాలి. వీటితో పాటు వ్యాయామం తప్పనిసరి.

    స్వచ్ఛమైన గాలి లభించే చోట వ్యాయామం చేయడం శ్రేయస్కరం. వెలుపల కాలుష్యం ఎక్కువగా ఉందనిపిస్తే ఇంట్లోనే చేసుకోవాలి.

    చెడు అలవాట్లు మద్యపానం, ధూమపానం, మాంసపానం అలవాట్లకు దూరంగా ఉండటం చాలా మంచిదని నిపుణలు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాయు కాలుష్యం
    గుండెపోటు

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ

    గుండెపోటు

    వివిధ రకాల గుండె జబ్బులకు కారణాలు లైఫ్-స్టైల్
    చెడు కొవ్వు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. కొవ్వు పెరగకుండా చేసే దారులు బరువు తగ్గడం
    ఆహారం: బాదం, వేరుశనగ.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఆరోగ్యకరమైన ఆహారం
    రోజువారి పనుల్లో ఒత్తిడి ఫీలవుతున్నారా? మీ రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఎదురయ్యే సమస్యలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025