స్ట్రీట్ ఫుడ్: భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో నోరూరించే చిరుతిళ్ళు ఇవే
భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఫేమస్. సాయంకాలం పూట రోడ్డు మీద వెళ్తుంటే రకరకాల వెరైటీలు గల స్ట్రీట్ ఫుడ్స్ సువాసనలు మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది. అలాగే ఆ స్ట్రీట్ ఫుడ్ చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలోని నగరాల్లో ప్రముఖమైన స్ట్రీట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ ఢిల్లీ: దేశ రాజధానిలో మొఘల్ సామ్రాజ కాలంనాటి కొన్ని ఫుడ్స్ మీకు కనిపిస్తాయి. చాందినీ చౌక్, జామా మసీద్ ప్రాంతాల్లో మొఘలాయి రెస్టారెంట్లు ఉంటాయి. ఇక్కడ చాట్ మసాలా, మోమోస్, మటర్ కుల్చా చోలే బటూరే మొదలగు స్ట్రీట్ ఫుడ్స్ మీకు నోరూరేలా చేస్తాయి.
బీచ్ ప్రాంతంలో లభించే సుండల్
లక్నో: ఈ ప్రాంతంలో టోక్రి చాట్ అనే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. అలాగే మఖ్ఖన్, మలై పాన్ వంటి వెరైటీలు మీకు కనిపిస్తాయి. కోల్ కతా: ఇక్కడ రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ మీకు కనిపిస్తాయి డీప్ ఫ్రై చేసిన ఆహారాలు ఆలు చోక్, బేగుని, పెన్యాజీ చాలా ఫేమస్. ఈ మూడింటిని కలిపి టెలిబాజా అని పిలుస్తారు. మీకు కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు ఇష్టమైతే పుచ్కాస్ తప్పకుండా ట్రై చేయండి. చెన్నై: బర్మా బజార్ ప్రాంతంలో బర్మీస్ నూడిల్ డిష్ అనే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. బీచ్ ప్రాంతంలో సుండల్ అనే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే పాలతో చేసే జిగర్తాండ మీరు ట్రై చేయవచ్చు.
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్
బెంగళూరు: ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అరటి పండ్లతో తయారు చేసే మంగళూరు బన్స్ కచ్చితంగా ట్రై చేయండి. తియ్యగా పుల్లగా ఉండే ఈ బన్స్ మీకు బాగా నచ్చుతాయి. అలాగే పప్పు, బెల్లం, ధనియాల పొడి, పిండి, రవ్వతో తయారైన దాల్ ఒబ్బట్టు కచ్చితంగా తినండి. హైదరాబాద్: హైదరాబాద్ లోని కోటి ప్రాంతంలో గోకుల్ చాట్ షాప్ లో చాట్ మసాలా కచ్చితంగా ట్రై చేయండి. అలాగే నగరంలోని షాగౌస్ కేఫ్, పిస్తా హౌస్ హోటల్స్ లో హైదరాబాద్ హలీం చాలా ఫేమస్. ఇంకా హైదరాబాద్ లో ఏ ప్రాంతంలోనైనా దొరికే స్ట్రీట్ ఫుడ్ ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్. ఛాయ్ తాగుతూ బిస్కెట్ తింటే ఆ మజాయే వేరు.