భారతదేశ చిరుతిళ్ళకు ర్యాంకులు:అత్యంత దరిద్రమైన తిండిగా టాప్ లో దహీ పూరి
భారతదేశంలోని నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. ఒక్కో నగరంలో ఒక్కో చిరుతిండి ఫేమస్ గా ఉంటుంది. సాయంత్రమవగానే ఆఫీసుల్లోంచి బయటకు వచ్చి ఏదో ఒక చిరుతిండి తినకపోతే రోజు గడవని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్స్ కి టేస్ట్ అట్లాస్ సంస్థ ర్యాంక్స్ ఇచ్చింది. అత్యంత దరిద్రమైన చిరుతిళ్ళ జాబితాను టేస్ట్ అట్లాస్ తయారు చేసింది. అందులో మొదటి స్థానంలో దహీ పూరి నిలిచింది. అవును, మీరు విన్నది నిజమే, దహీ పూరికి అత్యంత దరిద్రమైన చిరుతిళ్ళలో మొదటి స్థానం దక్కింది. అత్యంత దరిద్రమైన చిరుతిళ్ళ జాబితాలో రెండవ దరిద్రమైనదిగా మధ్యప్రదేశ్ కు చెందిన సేవ్ (Sev) నిలిచింది.
రేటింగ్స్ ద్వారా ర్యాంకింగ్స్
ఆ తర్వాత మూడవ స్థానంలో గుజరాత్ కి చెందిన డబేలి ఉంది. ఇంకా నాలుగవ స్థానంలో ముంబైకి చెందిన శాండ్విచ్ ఉంది. ఐదవ స్థానంలో ఎగ్ బుర్జి, ఆరవ స్థానంలో సాబుదానా వడా, ఏడవ స్థానంలో దహీ వడ ఉన్నాయి. ఉత్తరాదిన ఎక్కువ మందికి పరిచయమున్న పాప్రి చాట్, 8వ స్థానాన్ని దక్కించుకుంది. పంజాబ్ కి చెందిన గోబీ పరోఠా తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక పదవ స్థానంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ బోండా నిలిచింది. బోండాలు ఉత్తరాది వారికి మాత్రమే కాదు దక్షిణాది వారికి కూడా పరిచయమే. వినియోగదారుల రేటింగ్స్ ద్వారా ఈ ర్యాంక్స్ నిర్ణయించారు. మొత్తం 2508రేటింగ్స్ లో కేవలం 1773 రేటింగ్స్ మాత్రమే చెల్లుబాటు అయ్యాయి.