జీర్ణశక్తిని పెంచడం నుండి బరువు తగ్గించడం వరకు జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు
మన కిచెన్ లో ఉండే వస్తువులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే వాటిని ఎలా వాడాలో తెలియాలి. ప్రస్తుతం మనం రోజు కూరల్లో వేసే జీలకర్ర వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. జీలకర్రలో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఆరోగ్యం అందుతుంది. జీర్ణశక్తిని పెంచే జీలకర్ర ప్రతిరోజు ఖాళీ కడుపుతో జీలకర్రను తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తద్వారా గ్యాస్, అజీర్తి, మలగబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే జీలకర్ర
చర్మాన్ని సంరక్షిస్తుంది: ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నవారు జీలకర్రను పొడిగా చేసి నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోయి చర్మం మిలమిలా మెరుస్తుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది: అధిక బరువుతో ఇబ్బంది పడేవారు జీలకర్రను రోజూ తీసుకోవాలి. కాల్చిన జీలకర్రను నీటిలో వేసి గోరువెచ్చగా మరిగించి ఆ తర్వాత అందులో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి బరువు తగ్గుతారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల కడుపులో ఉన్న క్రిములు చనిపోతాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జ్ఞాపక శక్తిని పెంచుతుంది: జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మంచి ఆరోగ్యం అందుతుంది. ఇలా రోజు చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.