Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం
దీపావళి అనేది భారతదేశంలో ఘనంగా జరుపుకునే పండుగ. ఇది హిందువుల పండగైనా.. అన్ని వర్గాల ప్రజలు జరుపునే వేడుక. అయితే పండగ ఒకటే అయినా.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్‌లో దీపావళి పూజ తర్వాత 6రోజులకు లక్ష్మీ పూజను చేస్తారు. దీపావళి రోజున కాళీ పూజ చేస్తారు. రాత్రి పూర్వీకులను పూజిస్తారు. ఒడిషా పశ్చిమ బెంగాల్ మాదిరిగానే ఒడిశాలో కూడా దీపావళిని పూర్వీకులకు నివాళిగా జరుపుకుంటారు. మహాలయ అమావాసి నాటి చీకటి రాత్రికి పూర్వీకులు, దేవతలు అందరూ ఇళ్లకు వస్తారని వారు నమ్ముతారు. అందుకే వారికి స్వాగతం పలకే ఉద్దేశంతో ఇళ్లంతా దీపాలను వెలిగిస్తారు.
గుజరాత్‌లో దీపావళికి మార్కెట్లు కళకళ
పశ్చిమ భారతదేశంలో దీపావళిని 5 రోజులు జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో దీపావళి వాణిజ్యంతో ముడిపడి ఉంటుంది. దీపావళిని పశ్చిమ భారత్‌లో ఘనంగా నిర్వహిస్తారు. దీపావళికి కొన్ని రోజుల ముందు పశ్చిమ భారతదేశంలోని మార్కెట్లు పండగ షాపింగ్ కోసం వచ్చే వారితో నిండిపోతాయి. గుజరాత్‌లో దీపావళి రాత్రి గుజరాతీలు తమ ఇళ్ల ముందు రంగోలీలు వేస్తారు. లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు పాదముద్రలు గీస్తారు. ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. గుజరాతీలకు దీపావళి అంటే కొత్త సంవత్సరం అంత పండుగ అన్నమాట. పశ్చిమ భారత్‌లో కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వివాహం వంటి కార్యక్రమాలు శుభప్రదంగా భావిస్తారు. గుజరాత్‌లోని కొన్ని ఇళ్లలో రాత్రంతా నెయ్యి దీపాలు వెలిగిస్తారు.
మహారాష్ట్రలో నాలుగు రోజులు వేడుక
మహారాష్ట్రలో దీపావళిని 4 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజును వసుపరాలు అంటారు. ఆ రోజు ఆవులకు, దూడలకు హారతి చేస్తారు. ఇది తల్లి, బిడ్డ మధ్య ప్రేమ వ్యక్తీకరణను సూచిస్తుంది. మరుసటి రోజు ధనత్రియోదశిని ఇతర ప్రాంతాలలో జరుపుకునే విధంగా జరుపుకుంటారు. నరకసతుర్దశి మూడవ రోజు తెల్లవారుజామున నూనె స్నానం చేసి గుడికి వెళ్తారు. మధ్యాహ్న భోజనం మహారాష్ట్ర తరహాలో తయారుచేస్తారు. నాలుగో రోజు దీపావళిని జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీపూజ చేస్తారు. డబ్బు, నగలు వంటి సంపదలు ఉంచి లక్ష్మీదేవిని పూజిస్తారు.
ఉత్తర భారతంలో ఐదురోజులు
రాముడు, అతని భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు, హనుమంతుడు రావణుడిని ఓడించిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును పురస్కరించుకొని, ఉత్తర భారతదేశంలో దీపావళిని జరుపుకుంటారు. ప్రజలు దీపావళి రోజు రాత్రి మట్టి కుండలను వెలిగిస్తారు, ఎందుకంటే వారు తిరిగి వచ్చే సమయం అమావాస్య కావడంతో వెలుగు కోసం దీపాలను వెలిగిస్తారు. దక్షిణ భారతంలో ఒకరోజు పండగ మరోవైపు, దక్షిణ భారతీయులు శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని ఓడించిన రోజును పురుస్కరించుకొని దీపావళిని జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవి వివాహం జరిగిందని కూడా నమ్ముతారు. ఈ క్రమంలో దక్షిణభారతంలో దీపావళిని ఒకరోజు మాత్రమే జరుపుకుంటారు.