Non Refrigeration : కూరగాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఈ 5 మాత్రం మంచిది కాదు
కూరగాయలు మొదలు కిరాణా సామగ్రిలోని అల్లం వెల్లుల్లి వరకు అంతా ఫ్రిజ్‌లో పెట్టడమే అలవాటు. మరోవైపు చాలా మందికి ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టందే రోజు గడవదు. రిఫ్రిజిరేటర్‌లో కూరగాయలు, ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతాం. ఫలితంగా అవి పాడైపోకుండా ఉంటాయి. అయితే మీకు తెలియకుండానే మీ రిఫ్రిజిరేటర్‌లోపలు రకాల కూరగాయలను నిల్వ చేసుకుంటుండొచ్చు. కానీ ఈ 5 కూరగాయలను మాత్రం ఫ్రిడ్జిలో పెట్టకూడదు. టామాటా : టమోటాలు- ఎర్రటి కూరగాయలు. కూరల్లో ప్రధాన ఆహారం. వీటికి చల్లని ఉష్ణోగ్రతలకు ప్రతిస్పందించే ఎంజైమ్ ఉంటుంది. ఫలితంగా అవి మెత్తగా అవుతాయి. అంతేకాకుండా, టమోటాల రుచిని ఉత్పత్తి చేసే కణాలను ఫ్రిడ్జిలోని చల్లదనం విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా టామోటాలు సహజ రుచిని కోల్పోతాయి.
ఫ్రిడ్జిలో పెడితే టేస్ట్ ఉండదు, పైగా అనారోగ్యం
అవోకాడో : అవోకాడోలను శీతలీకరించడం వల్ల అవి నెమ్మదిగా పండుతాయి. అంతేకాదు అది వినియోగానికి పనికిరానిదిగా మారుతుంది. చల్లటి ఉష్ణోగ్రతలు ఆకృతిని సైతం గందరగోళానికి గురిచేస్తుంది. కాయ త్వరగా కుళ్లిపోయేలా చేస్తుంది. వాటిని సహజంగా ఆరుబయట ఉంచడమే మంచిది. దీంతో నాణ్యతతో పాటు రుచికరంగా ఉంటాయి. ఆలుగడ్డలు : చాలా మంది బంగాళాదుంపలను వాటి నాణ్యతను కాపాడుకోవడానికి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తారు. మీ ఫ్రిజ్‌లోని చల్లని ఉష్ణోగ్రత, ఈ కూరగాయల్లోని చక్కెర పదార్థాన్ని పెంచుతుంది. వీటిని వేయించినప్పుడు లేదా కాల్చినప్పుడు క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంది. వాటిని సాధారణ గది ఉష్ణోగ్రతలో నిల్వ చేయడానికే మొగ్గు చూపించాలని నిపుణలు సైతం సూచిస్తున్నారు.
శీతలీకరణ చేస్తే రంగు, రుచి, వాసన, నాణ్యత మారిపోతాయన్న నిపుణులు
పుచ్చకాయ : చల్లని పుచ్చకాయ, కస్తూరి పుచ్చకాయలను అందరూ ఇష్టంగా లాగించేస్తారు. అయితే వీటిని ఫ్రిజ్‌లో భద్రపరచడం మంచిది కాదు. సూపర్ మార్కెట్లో కూడా పుచ్చకాయలను చల్లని అరల్లో ఉంచరు. ఎందుకంటే శీతలీకరణం జరిగితే కాయలు క్షీణతకు గురవుతాయి. దీంతో వాటి నాణ్యత, రంగు రుచిని కోల్పోతాయి. బ్రెడ్ : మీరు మీ రిఫ్రిజిరేటర్‌లో రొట్టెని(బ్రెడ్) ఉంచడం అలవాటుంటే, దాన్ని వెంటనే మానుకోవాల్సిన అవసరం ఉంది. చల్లని ఉష్ణోగ్రత బ్రెడ్‌లో ఉండే స్టార్చ్‌ని రీక్రిస్టలైజ్ చేసేందుకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా బ్రెడ్ తేమను కోల్పోయి నిర్జీవంగా మారి, దాని నాణ్యతను పొగొట్టకుంటుందని చెబుతున్నారు. ఇలాంటి బ్రెడ్ ఎప్పటికీ తినేందుకు శ్రేయస్కారం కాదంటున్నారు.