
చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడం బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంకేతమా? దీనిలో నిజమెంత?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మహిళల మరణానికి కారణం రొమ్ము క్యాన్సర్. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు కూడా ధ్రువీకరించారు. ప్రతేడాది ఎంతోమంది మహిళలు ఈ ప్రాణాంతక క్యాన్సర్ భారీన పడి మరణిస్తున్నారు.
ముఖ్యంగా ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్లే ఈ క్యాన్సర్ కేసులు రోజు రోజుకూ ఎక్కువతున్నాయి.
ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అక్టోబర్ 13న రొమ్ము దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.
మరీ ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ముల కణాలలో ఏర్పడే ఒక రకమైన ప్రమాదకరమైన వ్యాధి.
Details
రొమ్ము క్యాన్సర్ పురుషులకు కూడా వచ్చే అవకాశం
రొమ్ములోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగే ఒక వ్యాధి. రొమ్ము క్యాన్సర్ రకాన్ని బట్టి రొమ్ములోని ఏ కణాలు క్యాన్సర్‌గా మారుతుందనేది దానిపై ఆధారపడి ఉంటుంది.
రొమ్ము క్యాన్సర్ పురుషులకు కూడా వస్తుంది. అయితే ఇది ఆడవారికి ఎక్కువగా వస్తుంది.
రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఇవే
రొమ్ము ఆకారం, పరిమాణంలో మార్పులు
రొమ్ములో బఠానీ గింజల్లాంటి చిన్న చిన్న గడ్డలు
రొమ్ము లోపల లేదా సమీపంలో, చంకల్లో గడ్డలు
రొమ్ము లేదా చనుమొనల చర్మం రంగులో మార్పులు
రొమ్ము లేదా చనుమొనల చర్మం ఎర్రబడటం
రొమ్ము చర్మం గట్టిగా ఉంటుంది
చనుమొనల నుండచి రక్తస్రావం లేదా ద్రవాలు కారడం
Details
అల్కహాల్ కు దూరంగా ఉండాలి
వయస్సుతో పాటు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్యాన్సర్ 50ఏళ్లు పైబడిన మహిళలకు వచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది.
బీఆర్సీఏ 1, బీఆర్సీ 2 వంటి జన్యువులలో ఉత్పరివర్తనలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా పెంచనున్నాయి.
రుతుస్రావం త్వరగా వచ్చినా, ఆలస్యంగా రుతువిరితి వచ్చినా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది.
మద్యం ఎక్కువగా తాగడం, ఊబకాయం, నీటిని తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి ప్రబిలే అవకాశం ఉంది.
Details
మమోగ్రఫీ ద్వారా రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చు
40 ఏళ్లు పైబడిన వారు వార్షిక మామోగ్రామ్ చేయించుకోవాలి. మామోగ్రఫీ ద్వారా రొమ్మును క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.
రొమ్ములో ఎలాంటి మార్పులొచ్చినా ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవడం మంచిది.
హెల్తీ ఫుడ్‌ను తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు.
ఆహారంలో పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు పాటైనా వ్యాయామం చేయాలి.
మీ కుటంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పటికప్పుడు అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.