LOADING...
Eating During Eclipse: చంద్రగ్రహణం సమయంలో ఆహారం తింటే నిజంగా విషమా? సైన్స్ ఏం చెబుతుందో చూడండి!
చంద్రగ్రహణం సమయంలో ఆహారం తింటే నిజంగా విషమా? సైన్స్ ఏం చెబుతుందో చూడండి!

Eating During Eclipse: చంద్రగ్రహణం సమయంలో ఆహారం తింటే నిజంగా విషమా? సైన్స్ ఏం చెబుతుందో చూడండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2025
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాదిలో రెండోవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 09:58 గంటలకు ప్రారంభమై, మధ్యరాత్రి 01:26 గంటలకు ముగియనుంది. ఖగోళ సంఘటన అయిన చంద్రగ్రహణం గురించి ప్రజల్లో ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా హిందూ శాస్త్రాల పేరుతో కొన్ని వర్గాలు భయపెడుతూ "గ్రహణ సమయంలో ఇలా చేయకూడదు, గర్భిణులు బయటకు రావొద్దు" అంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. కానీ సైన్స్ ప్రకారం చంద్రగ్రహణం పూర్తిగా సహజమైన ఖగోళ సంఘటన మాత్రమే, ఆరోగ్యం లేదా ప్రకృతి విపత్తులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది.

Details

చంద్రగ్రహణం సమయంలో ఆహారం విషం అవుతుందా?

గ్రహణం సమయంలో వండిన లేదా తిన్న ఆహారం విషపూరితం అవుతుందని ఒక నమ్మకం ఉంది. కానీ సైన్స్ చెబుతున్నది ఏమిటంటే - చంద్రగ్రహణం ఆహారంపై ఎటువంటి ప్రభావం చూపదు. పూర్వం ఫ్రిజ్ లేకపోవడంతో వండిన ఆహారం త్వరగా పాడైపోయేది. ఆ పరిస్థితులు ఈ అపోహలకు దారి తీసినట్టు నిపుణులు చెబుతున్నారు.

Details

గర్భిణీ స్త్రీలపై గ్రహణ ప్రభావం ఉందా?

గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళితే బిడ్డకు మచ్చలు లేదా కోతలు వస్తాయని ఒక పెద్ద అపోహ ఉంది. కానీ సైన్స్ ప్రకారం, బిడ్డ శారీరక నిర్మాణం పూర్తిగా DNA, గర్భంలో అభివృద్ధి ప్రక్రియ ద్వారా నిర్ణయించారు. చంద్రగ్రహణం దీనికి ఏమాత్రం సంబంధం లేదు.

Details

నీరు, మొక్కలు కలుషితమవుతాయా?

గ్రహణ సమయంలో ఇంట్లోని నీరు, మొక్కలు కలుషితమవుతాయని ఒక నమ్మకం ఉంది. కానీ సైన్స్ ప్రకారం చంద్రగ్రహణం వీటిపై ఎటువంటి ప్రభావం చూపదు. ఇది కూడా మూఢనమ్మకం మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం ఉందా? గ్రహణం కారణంగా భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని ఒక అపోహ ఉంది. కానీ చంద్రగ్రహణం ఒక ఖగోళ సంఘటన మాత్రమే. భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు దీనికి ప్రత్యక్ష సంబంధం లేదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Details

ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా?

చంద్రగ్రహణం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అనేకులు నమ్ముతారు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరికి అనారోగ్యం అనిపించడం భయం లేదా నమ్మకం వల్ల మాత్రమే. దీనినే ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లేసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటి? ప్లేసిబో ఎఫెక్ట్ అనేది ఒక వ్యక్తి తాను చికిత్స పొందుతున్నానని నమ్మినప్పుడు, ఆ నమ్మకం వల్లనే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక రోగికి చక్కెర మాత్రను "ఇది తలనొప్పి మందు" అని చెప్పి ఇస్తే, రోగి నమ్మకం వల్లే తలనొప్పి తగ్గుతుంది. ఇది అసలు ఔషధం ప్రభావం కాదు, రోగి నమ్మక ప్రభావం మాత్రమే.