Bathukamma: బతుకమ్మ పండుగ.. ఏడు,ఎనిమిది,తొమ్మిది రోజున సమర్పించే పూలు ఏంటి.. వాటి ఔషధ గుణాలు గురించి తెలుసుకోండి
ఆశ్వయుజ మాసం రాగానే, బతుకమ్మ పండగ సమీపిస్తున్నదని అర్థం. భాద్రపద అమావాస్య నుంచి ప్రారంభమై తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండుగను ప్రధానంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుతారు. దసరా పండుగకు ముందు రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకను బతుకమ్మ పండుగ, బతకమ్మ పండుగ, గౌరి పండుగ, సద్దుల పండుగ వంటి పేర్లతో పిలుస్తారు. దసరా పండుగకున్న ప్రాధాన్యం ఎంత ఉన్నదో, బతుకమ్మ పండుగకూ అంతే ఉంది. ఈ పండుగ ప్రధానంగా మహిళలకు సంబంధించినదిగా గుర్తింపు పొందింది. వర్షాకాలం ముగిసి, శీతాకాలం రాబోతున్న సమయంలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. చెరువులు నూతన జలాలతో నిండిపోయి, వివిధ రకాల పూలు రంగురంగులుగా వికసిస్తాయి.
తామర పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు
ఈ ప్రకృతి రమణీయతలో, తెలంగాణ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి, ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడు ఈ మూడు రోజులలో బతుకమ్మకు అలంకరించే పూలలోని ఔషధ గుణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తామర పువ్వులు ఎంతో సుందరంగా ఉంటాయి. ఇవి మతపరమైన పూజల్లో విస్తృతంగా వినియోగిస్తారు. అంతేకాకుండా, తినే పదార్థాలు, పానీయాలలో కూడా ఈ పువ్వులను ఉపయోగిస్తారు. తామర గింజలకు మంచి డిమాండ్ ఉండగా, తామర పువ్వు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మీకు తెలుసా? తామర పువ్వులు అనేక రోగాలకు చికిత్సగా పనిచేస్తాయి.
తామర పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు
తామర పువ్వుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, క్లోరిన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి కొవ్వు లేకుండా, కార్బోహైడ్రేట్లు,ఫైబర్ యొక్క ఆరోగ్యకరమైన మూలాలుగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ పువ్వు ఉత్తమమైన ఔషధంగా గుర్తించబడింది, దాంతో జ్వరం, తలనొప్పి, చికాకు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. తామర పువ్వు స్వల్ప తియ్యదనంతో, రుచిలో తక్కువగా ఉంటుంది, కానీ గుండె ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా, ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పువ్వు శరీరానికి శీతలీకరణ ప్రభావాన్ని ఇస్తూ, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
గుమ్మడికాయ-పువ్వు ఆరోగ్య-ప్రయోజనాలు
ముఖ చర్మానికి దీన్ని పట్టిస్తే ప్రకాశవంతమైన చర్మం పొందవచ్చు. అలాగే, లోటస్ పువ్వు జ్వరాన్ని తగ్గించే యాంటిపైరేటిక్ లక్షణాలను కలిగి ఉండి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ పువ్వులు కూడా ఆ కూరగాయల తరహాలోనే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇవి కనిపించేంత అందంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గుమ్మడి పువ్వులు విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. గుమ్మడికాయ కూరగాయల మాదిరిగానే, ఈ పువ్వులు కూడా శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. గుమ్మడిపువ్వుల ఆరోగ్య ప్రయోజనాలపై తెలుసుకుందాం.
గుమ్మడికాయ-పువ్వు ఆరోగ్య-ప్రయోజనాలు
గుమ్మడిపువ్వులు శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఉపయోగపడతాయి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఈ సీజన్‌లో గుమ్మడి పువ్వుల వినియోగం ఎంతో ప్రయోజనకరం. ఈ పువ్వులు తీసుకోవడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. గుమ్మడి పువ్వులు జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలలో కూడా దోహదపడతాయి. ఈ పువ్వులు శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, జలుబు, దగ్గు వంటి సమస్యల నివారణ కోసం ఆహారంలో గుమ్మడి పువ్వులను చేర్చుకోవడం మంచిది.
పట్టుకుచ్చు (సీత జడ) పూలు ఆరోగ్య-ప్రయోజనాలు
బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా అందాన్ని చేకూర్చే పూలలో పట్టుకుచ్చు (సీత జడ) పువ్వు ఒకటి. దీని శాస్త్రీయ నామం 'సిలోసియా అరెగేటియా'. ఈ మొక్క అమరాంథస్ కుటుంబానికి చెందినది. పట్టుకుచ్చు పువ్వులో జలుబు,ఆస్తమా వంటి సమస్యలను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క ఆకులు గాయాలు, నోటి పొక్కులను తగ్గించడంలో కూడా సహాయపడుతాయి.