మాత్ బీన్: మహారాష్ట్రకు చెందిన ఈ పప్పు వల్ల కలిగే 5 లాభాలు
మాత్ బీన్.. దీన్ని మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా తింటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుంది. దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ. తెలుగు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆగ్రా మిక్చర్ అని అంటారు. ప్రస్తుతం మాత్ బీన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం డయాబెటిస్ తో బాధపడేవారు దీన్ని తినవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మంచి పాత్ర పోషిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది: మాత్ బీన్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్దకం సమస్య దూరమవుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్స్, కఠినంగా ఉండే కార్బోహైడ్రేట్లను విరగొట్టి తొందరగా జీర్ణమయ్యేలా చేసి, శరీరానికి శక్తినిస్తుంది.
బరువు తగ్గడంలో ఉపయోగపడే మాత్ బీన్
మాత్ బీన్స్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 100గ్రాముల మాత్ బీన్స్ లో 343కేలరీలు ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో మాత్ బీన్ ని చేర్చుకోవడం మంచిది. ఇందులోని ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉంటుంది. తొందరగా ఆకలివేయదు. ఎక్కువగా తినకుండా ఉంటారు. అదీగాక దీనిలోని ప్రోటీన్ కారణంగా శరీర జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. శరీర ఇబ్బందులను దూరం చేస్తుంది: ఫ్లెవనాయిడ్స్, సపోనిన్స్ అనే పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో కలిగే నొప్పులు, కడుపు సంబంధిత సమస్యలు మీ దరికి రావు. మాత్ బీన్స్ లో మెగ్నీషియం, ఐరన్, కాపర్, పొటాషియం, పాస్ఫరస్, జింక్, సోడియం, విటమిన్ బీ1, బీ3, బీ5, విటమిన్ సి ఉంటాయి.