చూయింగ్ గమ్ ఆరోగ్యకరమే, సైన్స్ కూడా చెబుతోంది, వివరాలివే
సాధారణంగా నోటి దుర్వాసన పోవడానికి చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ మీకిది తెలుసా? చూయింగ్ గమ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అప్పట్లో మాయా నాగరికతకు చెందిన ప్రజలు, ఆకలి పోగొట్టుకోవడానికి చూయింగ్ గమ్ నమిలేవారు. ప్రస్తుతం చూయింగ్ గమ్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది: చూయింగ్ గమ్ నమలడం వల్ల మెదడుకు చేరే రక్తప్రవాహం పెరుగుతుంది. దానివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రొఫెసర్ ఆండ్రూ షోలే రీసెర్చ్ ప్రకారం, 35%మంది చూయింగ్ గమ్ నమిలినవారిలో జ్ఞాపకశక్తి పెరిగినట్లు తెలిసింది. గుండె మంటను తగ్గిస్తుంది: తిన్న తర్వాత ఆహారనాళంలో వచ్చే మంటను తగ్గించడంలో చూయింగ్ గమ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆహారనాళంలో పేరుకున్న గ్యాస్ ని చూయింగ్ గమ్ తొలగిస్తుంది.
వాంతులు, వికారాలను తగ్గించే చూయింగ్ గమ్
పొద్దున్న లేవగానే అలసినట్లుగా ఉండడం, ఏ పనీ చేయాలనిపించకపోవడం, బద్దకంగా ఉండడం, వికారం, వాంతులను చూయింగ్ గమ్ తగ్గిస్తుంది. ఒకానొక పరిశోధనలో, సర్జరీ తర్వాత ఇబ్బంది పడే మహిళలు, చూయింగ్ గమ్ నమలడం వల్ల ఉపశమనం పొందినట్లు తెలిసింది. బరువు తగ్గడానికి: రోడ్ ఐలాండ్ విశ్వ విద్యాలయం వారు చేపట్టిన పరిశోధనలో, చూయింగ్ గమ్ నమిలిన వారు, సాధారణ జనాల కంటే 67శాతం తక్కువ కేలరీలను తీసుకున్నారు. ఈ లెక్కన బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఒత్తిడి తగ్గిస్తుంది: 2011లో పబ్లిష్ అయిన పరిశోధన ప్రకారం, 14రోజులు చూయింగ్ గమ్ నమిలిన వారిలో ఒత్తిడి, యాంగ్జాయిటీ తగ్గినట్లు తెలిసింది. మూడ్ ని మార్చడంలో, అలసట రానివ్వకుండా చేయడంలో చూయింగ్ గమ్ సాయపడుతుంది.