Page Loader
 Mother's Day 2025: బహుమతులకన్నా ఇలా చేస్తే తల్లుల మనసు గెలవచ్చు..!
బహుమతులకన్నా ఇలా చేస్తే తల్లుల మనసు గెలవచ్చు..!

 Mother's Day 2025: బహుమతులకన్నా ఇలా చేస్తే తల్లుల మనసు గెలవచ్చు..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై ప్రేమను కురిపిస్తూ,నిరంతరం శ్రద్ధ చూపే వ్యక్తి తల్లి. పిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తారు, భర్త ఆఫీసుకు వెళ్తాడు.. వారందరికీ వారాంతాల్లో లేదా ప్రభుత్వ సెలవుల రూపంలో కొంత విశ్రాంతి లభిస్తుంది. కానీ తల్లికి మాత్రం అలాంటి విరామం ఉండదు. తన కుటుంబాన్ని గమ్యం చేసుకొని అలుపెరుగకుండా శ్రమిస్తూ, అందరి కోసమూ తన శక్తిని వినియోగిస్తూ, చూసేందుకు కనిపించని ప్రేమతో తన మద్దతునిచ్చే అతి మహత్తరమైన శక్తి అమ్మ. ఇలాంటి గొప్ప తల్లిని గౌరవించడమే కాకుండా, ఆమెను ఏడాది పొడవునా ఆనందంగా ఉంచాలనే సంకల్పంతో మాతృదినోత్సవాన్ని మనం జరుపుకోవాలి.

వివరాలు 

నిజమైన తల్లి ప్రేమ ముందు.. ఖరీదైన బహుమతి కూడా 

తల్లులు తొమ్మిది నెలలు గర్భంలో మోసి, మమతతో కనీ,ప్రేమతో జీవితాంతం కాపాడతారు. అలాంటి తల్లికి మదర్స్ డే రోజున చీర,మొబైల్ ఫోన్,గొలుసు లేదా ఉంగరం వంటి ఖరీదైన బహుమతులు ఇవ్వాలని అనుకోవచ్చు. అయితే చాలా తల్లులు అలాంటి బహుమతులు తీసుకున్నా"నాకు ఇవేంటి?"అని ప్రశ్నిస్తారు. ఎంత ఖరీదైన బహుమతిని ఇచ్చినా, నిజమైన తల్లి ప్రేమ ముందు అవన్నీ విలువ కోల్పోతాయి. తల్లిని నిజంగా సంతోషపెట్టాలంటే.. మదర్స్ డే రోజున ఆమె చేసే పనులను మీరు చేసి చూపించాలి. ఒక రోజు అయినా తల్లికి సెలవు ప్రకటించి, ఆమె బాధ్యతలను స్వీకరించండి. ఇది ఆమె మనసును గెలిచే అద్భుత మార్గం అవుతుంది. అమ్మ ప్రతి రోజు ఇంట్లో వంట చేస్తుంది,ఇల్లు శుభ్రం చేస్తుంది,అవసరమైతే బట్టలు ఉతుకుతుంది.

వివరాలు 

అమ్మ మనసును అర్థం చేసుకుని..

ఈ బాధ్యతలన్నింటి నుండి మదర్స్ డే నాడు ఆమెను విముక్తం చేసి,ఆ పనుల్ని భర్త, పిల్లలు కలిసి చేయాలి. అప్పుడే తల్లి అనేది కేవలం బాధ్యత కాదు.. ఆమె ఇంటి మహారాణి అనే భావన పుడుతుంది. తల్లికి గౌరవం ఇవ్వడం అంటే కేవలం మౌఖికంగా కాదు..ఆమె ఇష్టాలు,అభిరుచులను గుర్తించి, ఆమెకు నచ్చేలా ఇంటిని నిర్వహించడమూ అవసరం. ఆమె పని తగ్గించడమే కాదు,ఒత్తిడి లేకుండా చేయడం,ఆమె మనసును అర్థం చేసుకుని,ఆమె హృదయానికి హత్తుకునేలా ప్రవర్తించాలి. మదర్స్ డే రోజున ఆమెకు పూర్తిస్థాయి స్వేచ్ఛనివ్వండి. కనీసం ఆ ఒక్కరోజైనా కుటుంబం అంతా కలిసి కూర్చొని కుటుంబ విషయాలపై చర్చించండి. ఆమెకు మానసిక ప్రశాంతత కలిగించడానికి పాటలు పాడడం,పద్యాలు చెప్పడం వంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు.