Page Loader
Nikita Porwal: ఫెమినా మిస్‌ ఇండియా 2024 కిరీటాన్ని దక్కించుకున్న నిఖిత పోర్వాల్‌ 
ఫెమినా మిస్‌ ఇండియా 2024 కిరీటాన్ని దక్కించుకున్న నిఖిత పోర్వాల్‌

Nikita Porwal: ఫెమినా మిస్‌ ఇండియా 2024 కిరీటాన్ని దక్కించుకున్న నిఖిత పోర్వాల్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2024
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన నిఖిత పోర్వాల్‌ ఫెమినా మిస్‌ ఇండియా 2024 కిరీటాన్ని దక్కించుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోస్‌లో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో నిఖిత ఈ సారి విజేతగా నిలిచారు. గతేడాది విజేత నందిని గుప్తా నిఖితకు మిస్ ఇండియా కిరీటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నేహా ధూపియా మిస్ ఇండియా సాష్‌ను అలంకరించారు. ఈ విజయం ద్వారా నిఖిత మిస్‌ వరల్డ్‌ 2024 పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధమయ్యారు.

వివరాలు 

వీరే ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు..

ఈ 60వ ఫెమీనా మిస్‌ ఇండియా కాంపిటేష‌న్‌లో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు పాల్గొన్నారు. అందాలతో పాటు, వారి ప్రతిభను కూడా ప్రామాణికంగా తేల్చుతారు. జడ్జిల నుంచి ప్రశంసలు పొందిన నిఖిత, వరుస రౌండ్ల తర్వాత చివరి రౌండ్‌లో మంచి ప్రతిభ క‌న‌బ‌రిచి అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ పోటీలో మిస్‌ ఇండియా 2024 మొదటి రన్నరప్‌గా రేఖా పాండే, రెండ‌వ ర‌న్న‌ర‌ప్‌గా ఆయుశీ దోలకియాలు నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో మాజీ మిస్ ఇండియా సంగీతా బిజ్లానీ హాజరై సంద‌డి చేశారు.

వివరాలు 

చాలా గ‌ర్వంగా ఉందంటూ..

టైటిల్‌ను గెలుచుకున్న అనంత‌రం తన ఆనందాన్ని నిఖిత పోర్వాల్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విజయంతో తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందాన్ని చూసిన తర్వాత తాను గర్వంగా ఫీలవుతున్న‌ట్లు తెలిపారు. అయితే, తన ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంద‌ని, ఇంకా సాధించాల్సింది చాలా ఉంద‌ని చెప్పారు. తదుపరి జరగబోయే మిస్ వ‌రల్డ్ పోటీల్లో కూడా నిఖిత విజయం సాధిస్తుందని నెటిజర్లు ఆమెకు అభినందనలు తెలుపుతూ, స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు.