Palace On Wheels: 'నా సామిరంగా' చేస్తే ఈ ట్రైన్ లో ప్రయాణం చేయాలి.. ఇది కదా రాచరిక మర్యాద అంటే..
భారతదేశంలో రకరకాల రైళ్లు ఉన్నాయి. కానీ కొన్ని రైళ్లు ప్రత్యేకమైనవి, విలాసవంతమైనవి. అలాంటి వాటిలో అగ్రగామి రైలు "ప్యాలెస్ ఆన్ వీల్స్". ఇది రైలు మాత్రమే కాదు, కదిలే రాజభవనం లాంటిది. దీనిలో రాచరిక మర్యాదలతో ఆహారం, సౌకర్యాలు అందిస్తారు. అసలు ఆ ట్రైన్ ఏంటి.? ఎక్కడి నుంచి ఎక్కడి వరుకు నడుస్తుంది.? టికెట్ ధర ఎంత.? అన్ని ఈరోజు తెలుసుకుందాం.. ఈ ప్రత్యేక రైలు జనవరి 26, 1982న ప్రారంభించబడింది. భారతదేశంలోని మొట్టమొదటి లగ్జరీ రైల్లో ఇది ఒకటి. ప్యాలెస్ ఆన్ వీల్స్ రాయల్టీగా భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ రైళ్లలో ఒకటి.
ప్రతి కోచ్‌లో టెలివిజన్ సెట్‌లు
ప్రారంభంలో ఇది గుజరాత్, రాజ్‌పుతానా, బ్రిటీష్ వైస్రాయ్, హైదరాబాద్ నిజాం రాష్ట్రాల పాలకులకు రాచరిక సౌకర్యాలను అందించేందుకు రూపొందించబడింది. ఈ రైలులో రెండు విభిన్న రుచుల భోజన ఎంపికలతో పాటు అన్ని రాచరిక సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు ప్రత్యేకంగా 14 కోచ్‌లతో రూపొందించబడింది. కోచ్‌లలో ధనిక కళాకృతులు, వాల్ టు వాల్ కార్పెటింగ్, విలాసవంతమైన అప్హోల్స్టరీలతో ప్రత్యేకంగా అలంకరించబడిన సెలూన్లు ఉన్నాయి. రాచరిక వాతావరణం కలిగిన ఈ రైలులో ప్రతి కోచ్‌లో టెలివిజన్ సెట్‌లు, వ్యక్తిగత ప్యాంట్రీ, బాత్‌రూమ్, సహాయకుడి సేవలు అందుబాటులో ఉంటాయి.
రైలులో పర్యటనకు ఒక వ్యక్తికి రూ.5 లక్షల వరకు ఖర్చు
రాజస్థాన్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రారంభించిన ఈ ప్యాలెస్ ఆన్ వీల్స్, అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలులో పర్యటనకు ఒక వ్యక్తికి రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. మొత్తం 8 నుండి 13 రోజుల పాటు ఈ ట్రైన్ ఢిల్లీ నుండి ప్రారంభమై జైపూర్, ఉదయపూర్, స్వై మోద్‌పూర్, చిత్తోర్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, భరత్‌పూర్, ఆగ్రా మీదుగా తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది.