Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ముదిరితే ప్రమాదమే.. ఇలా చేస్తే తగ్గించుకోవచ్చు!
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దీనినే కడుపు క్యాన్సర్ అని అంటారు. నేటి కాలంలో ఈ సమస్యతో చాలామంది భయపెడుతున్నారు. ఈ వ్యాధికి సరైన చికిత్స తీసుకోకుంటే ఇది మరింత ముదిరే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ వ్యాధిని ముందుగా గుర్తించకపోతే చికిత్స చేయడం చాలా కష్టమవుతుంది. గ్లూకాగాన్, ఇన్సులిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్యాంక్రియాస్ సాయపడుతుంది. ప్యాంక్రియాస్ కణజాలంలో ప్రాణాంతక కణాలు ఏర్పడటాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారు. దీన్నే నిశ్శబ్ద వ్యాధిగా చెప్పొచ్చు.
ఈ వ్యాధిని గుర్తించాలంటే ఎండోస్కోపీ అవసరం
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ఇవే ఆకస్మిక బరువు తగ్గడం, ఆకలి తగ్గటం, డిప్రెషన్, రక్తంలో చక్కెర స్థాయిలు, ఆకస్మికంగా పెరగడం (డయాబెటిస్), బలహీనత & అలసట, విపరీతమైన ఆకలి లేదా దాహం, ముదురు రంగు మూత్రం, కడుపు నొప్పి, రక్తం గడ్డకట్టడం, కంళ్లు పసుపురంగులోకి మారటం, కాలివాపు, వాంతులు, అతిసారం ఈ వ్యాధిని గుర్తించాలంటే ఎండోస్కోపీ చేయాలి. సమస్య తెలిసిన తర్వాత ఆ భాగాన్ని తొలగించి సరైన చికిత్స చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.