Holiday Trip: మీ సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చెయ్యాలా.. అయితే ఈ మంచు కురిసే ప్రాంతాలకు ట్రిప్ ప్లాన్ చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి సెలవులు రాగానే చాలామంది ప్రయాణానికి సిద్ధమవుతారు. ముఖ్యంగా,మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు మంచు కురిసే ప్రదేశాలను ఎంపిక చేసుకుంటారు.
మీరు కూడా చల్లని వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటే, ఈ మంచుతో కప్పిన గమ్యస్థానాలను తప్పకుండా పరిశీలించండి.
భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు సీజన్‌ను అనుసరించి పూర్తిగా మారిపోతుంటాయి.
కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో హిమపాతం చోటుచేసుకుంటోంది.
మంచుతో నిండిన పర్వత ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు.
మీరు కూడా అలాంటి అనుభూతిని పొందాలనుకుంటే, ఈ ప్రదేశాల గురించి తెలుసుకోండి.
వివరాలు
కాశ్మీర్
కాశ్మీర్ పేరు వినగానే మనసులో మంచుతో కప్పిన పర్వతాలు, అందమైన లోయలు, ఆకర్షణీయమైన సరస్సులు, నిత్యం హరితవర్ణం కళ్ళకు కనిపిస్తాయి.
హిమాలయాలు,పీర్ పంజాల్ శ్రేణులతో చుట్టుముట్టబడి ఉన్న కాశ్మీర్, సహజసిద్ధమైన అందంతో అలరిస్తుంది.
పారాగ్లైడింగ్, బంజీ జంపింగ్, రాఫ్టింగ్ వంటి సాహస క్రీడలను ఇక్కడ ఆస్వాదించవచ్చు.
ఈ సమయాల్లో, ఈ ప్రాంతంలో మంచు కురిసే అవకాశముంది, అందుకే చల్లని అనుభూతి కోసం ఇది సరైన ఎంపిక.
వివరాలు
సోనమార్గ్
ఆకర్షణీయమైన హిమానీనదాలు, సరస్సులతో నిండిన సోనమార్గ్, దాని హిమచ్ఛన్నమైన ప్రకృతితో పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ అభిమాని వారు తప్పకుండా ఇక్కడకు రావాల్సిందే.
పురాతన సిల్క్ రూట్‌లో భాగమైన ఈ ప్రాంతం, హిమాలయాల మధ్య స్వర్గధామంగా అనిపిస్తుంది. జంటలు రొమాంటిక్ క్షణాలను గడిపేందుకు కూడా ఇది సరైన ప్రదేశం.
వివరాలు
మనాలి
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. వేడిగా ఉండే సమయాల్లో కూడా ఇక్కడ మంచు కురిసే అవకాశం ఉంటుంది.
నగరాల హడావుడి నుంచి విరామం తీసుకొని ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునేవారికి ఇది చక్కటి గమ్యస్థానం.
వేసవి సెలవుల్లో చల్లటి అనుభూతి కోరుకునే వారి కోసం మనాలి పర్యటన బాగా సరిపోతుంది.
వివరాలు
ఉత్తరాఖండ్‌లోని మంచు ప్రాంతాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ వంటి పవిత్ర ధామాల్లో మంచు నిరంతరం కురుస్తూనే ఉంటుంది.
భక్తి యాత్రకు వెళ్లేందుకు కావచ్చును, లేదంటే సహజ అందాలను ఆస్వాదించేందుకు కూడా ఇక్కడికి రావచ్చు. ఈ ప్రాంతాల్లో గడిపిన క్షణాలు నిశ్చయంగా మిమ్మల్ని కొత్త ఉల్లాసంతో నింపుతాయి.
ముఖ్యమైన సూచన
ఈ ప్రాంతాలకు వెళ్లే ముందు మార్గాల గురించి ముందస్తు సమాచారం తెలుసుకోవడం అవసరం. భారీ మంచు, నిరంతర వర్షాల కారణంగా కొన్ని మార్గాలు మూసివేసే అవకాశం ఉంది.