Page Loader
Claim Settlement: బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో జాగ్రత్తలు.. మీ హక్కులను ఎలా పొందాలంటే?
బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో జాగ్రత్తలు.. మీ హక్కులను ఎలా పొందాలంటే?

Claim Settlement: బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో జాగ్రత్తలు.. మీ హక్కులను ఎలా పొందాలంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2024
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

బీమా పాలసీలు సాధారణంగా అనేక రకాలుగా ఉంటాయి. కానీ వాటి ద్వారా క్లెయిమ్ చేసే ప్రక్రియలో చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు. బీమా సంస్థలు తమ పాలసీదారులకు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించడంలో కొన్ని సందర్భాల్లో విఫలమవుతుంటాయి. అయితే బీమా పాలసీ కోసం క్లెయిమ్ చేయడానికి అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం. 1)మెచ్యురిటీ క్లెయిమ్ పాలసీ గడువు పూర్తయ్యాక పొందే మొత్తాన్ని 'మెచ్యురిటీ క్లెయిమ్' అంటారు. 2. ఆకస్మిక మరణం పాలసీ గడువు నాటికి పాలసీదారు మరణిస్తే చెల్లించే క్లెయిమ్. 3. సర్వైవల్ బెనిఫిట్స్ పాలసీ గడువు మధ్యలో లభించే ప్రయోజనాలు.

Details

డెత్‌ క్లెయిమ్‌లు 

పాలసీ అమలులో ఉన్నప్పుడు మరణించిన పక్షంలో డెత్‌ క్లెయిమ్ చెల్లిస్తారు. ఇందులో ఎర్లీ డెత్‌ క్లెయిమ్ (పాలసీ ప్రారంభమైన 2 సంవత్సరాలలో మరణం) నాన్-ఎర్లీ డెత్‌ క్లెయిమ్ (ఆ తర్వాత మరణం) వేర్వేరుగా సెటిల్ అవుతాయి. ఎర్లీ డెత్‌ క్లెయిమ్ ఈ క్లెయిమ్‌లో పలు పత్రాలు, డెత్‌ సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ, వైద్యులు ఇచ్చిన ధృవీకరణలు అవసరం. వయసు, బంధుత్వం, మరణానికి కారణం వంటి వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది. సర్వైవల్ బెనిఫిట్స్ పాలసీ గడువు మధ్యలో ప్రయోజనాలు పొందడానికి, నిర్ణీత ప్రీమియం మొత్తం చెల్లించి ఉండాలి.

Details

 ప్రమాద బీమా 

పాలసీలో అదనంగా చెల్లించిన ప్రమాద బీమా పథకంలో గాయాల వల్ల మరణం లేదా శాశ్వత వైకల్యం ఏర్పడితే, బీమా పరిహారం చెల్లిస్తారు. 180 రోజుల్లో గాయాలు శాశ్వత వైకల్యంగా మారితే, మిగిలిన శరీర భాగాలను కోల్పోవడం లేదా కంటి చూపు కోల్పోవడం వంటి పరిస్థితుల్లో ఇది వర్తిస్తుంది. అప్పు క్లెయిమ్ పాలసీపై ఎలాంటి బకాయి లేదా అప్పు ఉన్నా, సంబంధిత బకాయిని బీమా మొత్తం నుంచి మినహాయించి, మిగిలిన మొత్తం బీమా దారికి చెల్లిస్తారు. బీమా ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరగుతుంది, అందుకే పాలసీ వివరాలు, అకౌంట్ డీటైల్స్ సరిగా నమోదు చేయడం అవసరం.

Details

 క్లెయిమ్‌కి అవసరమైన పత్రాలు

1. పాలసీ పట్టా 2. డిశ్చార్జి ఫారం 3. వ్యాధి/మరణ సంబంధిత ధృవీకరణ 4. వారసత్వ ధృవీకరణ బీమా కంపెనీతో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తే, సరికొత్త సమాచారం అందించి, సత్వరంగా క్లెయిమ్ చేయడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు.